ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో కొత్త వాటిని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. వాటికి జనాల్లో మంచి డిమాండ్ ను కూడా అందుకు..  మరో కొత్త బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.  ఈ కంపెనీ నుంచ సరికొత్త మోటార్ సైకిల్ వచ్చేసింది. అదే 2021 హీరో ఎక్స్ పల్స్ 200టీ మోటార్ సైకిల్. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 1.13 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ వాహనం పాత బీఎస్4 మోడల్ కంటే 19 వేలు ఎక్కువ..


మోటార్ సైకిల్లో పెద్దగా మార్పులేమి లేవు. 200సీసీ సింగిల్ సిలీండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 8500 ఆర్పీఎం వద్ద 18.1 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 6500 ఆర్పీఎం వద్ద 16.15 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ వాహనం సరికొత్త ఫ్యూయ్ ఇంజెక్షన్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది.  పాత మోడల్ ను రిపీట్ చేయకుండా ఈ బండిని మార్కెట్లోకి విడుదల చేశారు. దీని బరువు 154 కేజీలు ఉంటుంది.


2021 ఎక్స్ పల్స్ 200టీ మోటార్ సైకిల్లో పెద్దగా మార్పులేమి చేయలేదు. అదే డిజైన్, ఫీచర్లను పొందుపరిచారు. మెకానికల్ కాంపోనేంట్స్ లోనూ మార్పు లేవు. అయితే ఎల్ఈడీ హెడ్ ల్యాంపుతో కూడిన ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్లు, పుల్లీ డిజిటల్ ఎల్సీడీ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తో కూడిన స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ టర్న్ బై టర్న్ నేవిగేషన్ తో అందుబాటులోకి వచ్చింది.బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ, కేటీఎం డ్యూక్ 200 లాంటి మోటార్ సైకిళ్లు పోటీలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: