
మొన్న ప్రముఖ ప్రసిద్ధ గాయనీ వాణీ జయరాం మరణించారు. ఈమె అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చేసింది. అక్కడ లింగ భేదం, కుల భేదం పాటించలేదు. కానీ హైదరాబాద్ కు వచ్చే సరికి మాత్రం కుల భేదాలు గుర్తకువస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య దర్శకుడు విశ్వనాథ్, నటి జమున మరణించారు. తెలంగాణ ప్రభుత్వం వీరికి అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించ లేదు. కారణం వీరిలో ఒకరు బ్రాహ్మణ కులం, మరొకరు వైశ్యులు కావడమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
అంటే వీరి కులాల్లో ఎక్కువ ఓట్లు ఉండవు. వీరికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించినా ప్రభుత్వానికి కానీ పార్టీకి గానీ ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి అసలు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. పోనీ వీరికి ఆ స్థాయి లేదా అనుకుంటే తెలుగు సినీ ప్రపంచానికి దొరికిన ఒక స్వాతిముత్యం విశ్వనాథ్. ఎన్నో గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు ఆయన. అలాంటి వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించకపోవడం అత్యంత దారుణమైన విషయమన్న విమర్శలు వస్తున్నాయి.
ఇక సీనియర్ నటి జమున ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వ్యక్తులతో సరి సమానంగా నటించిన గొప్ప నాయకి. ఆమెకు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించలేరు. కారణం కులమేనా అన్న విమర్శలు వస్తున్నాయి. వీరికి స్థాయి ఉండి సమాజంలో గొప్ప వ్యక్తులుగా పేరున్నప్పటికీ వీరిది అగ్రకులం అందులో ఎక్కువ ఓట్లు ఉండవు. కాబట్టి ప్రభుత్వాలు కులాన్ని బట్టి మనిషి చావును కూడా అధికారికంగా నిర్వహించాలా వద్దా అనే పరిస్థితికి వచ్చాయని విమర్శకులు వాపోతున్నారు.