పూటకో పార్టీతో చంద్రబాబు జత కడతాడని సీపీఎం నాయకులు తాజాగా ఆరోపించారు.  వాస్తవంగా సీపీఐకి సీపీఎంకి తెలుగుదేశంతో కలిసి వెళ్లాలని ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీతో కేంద్రంలో కలిసి పని చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో లేదు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే గత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.  బీజేపీతో వెళ్లిన బెటరే కానీ కాంగ్రెస్ తో మాత్రం వెళ్లొద్దని అనకుంటున్నారు.


సీపీఎం పార్టీ తో పొత్తు కోసం గతంలో వేరే పార్టీలు జతకట్టేవి. కానీ ఇప్పుడు ఈ పార్టీలు వేరే పార్టీలతో కలిసి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు ఇతర పార్టీల మద్దతు దొరికితే బాగుండు అనే దీన స్థితిలోకి వెళ్లిపోయారు. అంతే కాదు సీపీఐ, సీపీఎం పార్టీల లీడర్లు చంద్రబాబు ఎప్పుడు పిలుస్తాడా వెళదామా అనే రీతిలో ఉన్నారు. ఒకప్పుడు సీపీఎం, సీపీఐ పార్టీలు డిమాండ్ చేసి ఆయా స్థానాల్లో పోటీ చేసేవి. ఇప్పుడు కేవలం పెద్ద పార్టీలకు మద్దతు కోసమే పని చేస్తున్నాయి.


తెలంగాణ లో మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయా కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతు తెలిపాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నేరవేరుస్తారని హామీ ఇచ్చారు. కానీ ఆయా ఎన్నికల హామీలు ఇప్పటి వరకు నెరవేరలేవు. దీని వల్ల నష్టం జరిగిపోయింది. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి  టీడీపీ, వైసీపీ పార్టీలు హాజరయ్యాయి. దీనిపై కమ్యూనిస్టు పార్టీల లీడర్లు టీడీపీ, వైసీపీ పార్టీల వారిని ఆ ప్రారంభోత్సవానికి వెళ్లొద్దని అడిగారు. దీనికి వారు మేం వెళుతున్నాం.. వస్తే మీరు రండి లేకపోతే మీ ఇష్టం అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.


ఈ విషయంపై డైరెక్టుగా సీతారాం ఏచూరీ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకుంటారో వారికి వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐ పార్టీలు పని చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: