
ఎందుకంటే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలను కలవడం అనేది అసాధ్యం అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంతోమంది సినిమా హీరో హీరోయిన్లే నేరుగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడగలుగుతున్నారు. దీంతో అభిమానులు కూడా సెలబ్రిటీలను తమకు నచ్చిన ప్రశ్నలు అడగ గలుగుతున్నారు అని చెప్పాలి. దీంతో సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ ఇలా తన లైఫ్ లో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకోగా.. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఏకంగా తాను చిన్నప్పుడు చనిపోయి మళ్లీ బ్రతికాను అంటూ షాకింగ్ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది ఓ హీరోయిన్. మేం వయసుకు వచ్చాం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది నితి టేలర్. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నేను నా పసితనంలో అనారోగ్యం కారణంగా కొద్దిసేపు చనిపోయి.. మళ్ళీ తిరిగి బతికాను. అప్పటినుంచి నేను ఒకటి అనుకుంటున్నా.. నేను జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు అని ఫిక్స్ అయ్యాను అంటూ నితి టేలర్ చెబుతుంది. గతంలో ఒక రియాల్టీ షో చేస్తున్న సమయంలో కూడా నితి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెకు గుండెల్లో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పారు.