ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం ఈ యువ నటుడు మొదటగా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ... కొన్ని రోజుల క్రితమే మీటర్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పరిగలించాడు. ఇందులో ఈ సంవత్సరం మొదటగా విడుదల అయినటు వంటి వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... మీటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. వినరో భాగ్యము విష్ణు కథ మూవీ కి మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించగా ... కాశ్మీరా పరదేశి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మురళీ శర్మ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీబాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రసారం కాబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా చానల్లో బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: