
అయితే పెళ్లి తర్వాత శోభిత ధూళిపాల ఫస్ట్ బర్త డే కావడంతో ఆ పుట్టిన రోజు ని చాలా సర్ప్రైజింగ్ గా సెలబ్రేట్ చేశాడు నాగచైతన్య . మే 31వ తేదీన 33వ పుట్టినరోజును జరుపుకుంది . ఈ సందర్భంగా నాగచైతన్య ఆమెకి ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరైనా భార్య భర్తడే కి ఉంగరం.. ఫోన్ లేదా ఏ డ్రెస్ ఇలాంటివి గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు . కానీ నాగచైతన్య మాత్రం టూ స్పెషల్ అండ్ టూ కాస్ట్లీ. భార్యపై ప్రేమను నిరూపించుకోవడానికి దాదాపు 10 కోట్ల విలువ చేసే గిఫ్ట్ను ఇచ్చినట్లు తెలుస్తుంది.
శోభిత ధూళిపాల కు ముంబైలో ఆమెకి బాగా నచ్చిన ఏరియాలో ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేసి.. ఆమె పేరు పై రిజిస్ట్రేషన్ చేయించారట . శోభిత ధూళిపాళ్లకి మొదటి నుంచి హైదరాబాద్ కన్నా ముంబై అంటే ఇష్టం . పలు ఇంటర్వ్యూలలో కూడా ఆ విషయాన్ని ఓపెన్ గానే బయటపెట్టింది . పైగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ అంతా కూడా అక్కడే. ఎక్కువ ఆమె అక్కడే మూవీలు కూడా చేస్తూ వస్తుంది . ఈ క్రమంలోనే ఆమెకు అక్కడ ఒక ఇల్లు ఉంటే బెటర్ అన్న ఆలోచనలో అదేవిధంగా పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త డే కావడంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆమెకు సకల సౌకర్యాలు కలిగేలా ఒక ప్లాట్ ను కొనుగోలు చేసే ఆమె పేరు పై రిజిస్టేషన్ చేయించారట . ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!