ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇదే చర్చ తీవ్ర హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే "కుబేర" సినిమాతో తనదైన మార్క్ స్టైల్ చూపించాడు ధనుష్.  ఈ సినిమాకి కర్త - కర్మ - క్రియ అంతా కూడా ధనుష్  అంటూ ఓ రేంజ్ లో మాట్లాడేసుకుంటున్నారు . ఎంతో కష్టపడి శేఖర్ కమ్ముల సినిమాను తెరకెక్కించినా అందరి కళ్ళు మాత్రం ధనుష్ వైఫై మల్లాయి . ఒకరు కాదు ఇద్దరు కాదు రిలీజ్ అయిన ప్రతి చోట సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ధనుష్ పర్ఫామెన్స్ కు స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తున్నారు.  అంత బాగా  సినిమాలో నటించాడు.


మరి ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో ధనుష్ పర్ఫామెన్స్ వెరే లెవెల్ అంటూ పొగిడేస్తున్నారు .  అంతేకాదు ఈసారి కచ్చితంగా నేషనల్ అవార్డు ధనుష్ కే వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా యాక్టివ్ అవుతున్నారు . అల్లు అర్జున్ పుష్ప2 లో ఏ విధంగా నటించాడో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఒక పాన్ ఇండియా స్టార్ట్ చీర కట్టుకొని నటించడం ..డాన్స్ చేయడం చాలా చాలా టఫ్ .. అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు .



పుష్ప2 సినిమా రిలీజ్ అయ్యాక అల్లుఅర్జున్ ని అందరూ పొగిడేసారు . ఈసారి నేషనల్ అవార్డు అల్లు అర్జున్ కి అని నో డౌట్ అంటూ చాలామంది ఓపెన్ గానే కామెంట్ చేశారు . అయితే ఇప్పుడు ధనుష్ సినిమా చూసిన తర్వాత అందరికీ కొత్త డౌట్లు మొదలయ్యాయి . ఈసారి నేషనల్ అవార్డు ఉత్తమ నటుడికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది.  బాలీవుడ్ నుంచి విక్కీ కౌశల్ "చావా" సినిమాకి నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి . ఇక కుబేర సినిమా నుంచి ధనుష్.. పుష్ప2 సినిమా నుంచి అల్లు అర్జున్ నామినేట్ అయ్యితే  ఎవరికి అవార్డు వస్తుంది ..? అని జనాలు చర్చించుకుంటున్నారు.



మరీ ముఖ్యంగా ఇప్పుడు ధనుష్ వర్సెస్ అల్లు అర్జున్ ల పేర్లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.  ఈసారి ఉత్తమ నటుడి గా నేషనల్ అవార్డు ఎవరికి వస్తుంది? ధనుష్ కా..? అల్లు అర్జున్ కా..? అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోల్స్ ట్రెండ్ అవుతున్నాయి.  దానికి తగ్గట్టే అభిమానులు కూడా ఏ హీరోకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు . ఈసారి ఉత్తమ నటుడు నేషనల్ అవార్డు పై చాలా ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు జనాలు. చూడాలి మరి ఈసారి నేషనల్ అవార్డు ఎవరికి వస్తుందో..? పుష్పట్టు సినిమాలో నటించినందుకు అల్లు అర్జున్  కా..? కుబేరా సినిమాలో నటించిన ధనుష్ కా..? మీరేమనుకుంటున్నారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: