తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు కెరియర్ ప్రారంభంలో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి ఆ తర్వాత దిల్ సినిమాతో నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టాడు. నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత దిల్ రాజు వరుస పెట్టి అనేక సినిమాలతో విజయాలను అందుకున్నాడు. దానితో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిపోయాడు. ఇప్పటికీ కూడా దిల్ రాజు అదే రేంజ్ లో కెరియర్ను మెయింటైన్ చేస్తున్నాడు.

దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న ప్రభాస్ , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు , రామ్ చరణ్ లతో కూడా సినిమాలను నిర్మించాడు. వీళ్ళతో కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... నేను రాబోయే రెండు , మూడు సంవత్సరాల లో టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి ప్రభాస్ , అల్లు అర్జున్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో సినిమాలను నిర్మిస్తాను అని పేర్కొన్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈ రెండు సినిమాలలో గేమ్ చేంజర్ మూవీ ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయగా , సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా దిల్ రాజు , నితిన్ హీరోగా రూపొందిన తమ్ముడు సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రచారాలను దిల్ రాజు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: