ప్రజాస్వామ్య దేశాల్లో ఒకొక్క దేశంలో ఒక్కో తరహా విధానం ఉంటుంది. మన దేశంలో అయితే ఎన్నికల ముందు నుంచే తమ గొప్పలు చెప్పుకోవడం, తాము చేసిన మంచి పనులు గురించి వివరించడం,  ఎదుటివారి బలహీనతలు ప్రస్తావించడం, బహిరంగ సభలు, ర్యాలీలు,  సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టో ప్రకటనలు ఈ తరహా ఉంటాయి. అమెరికా కూడా ప్రజాస్వామ్య దేశమే. కాకపోతే అక్కడ రెండే పార్టీలు ఉంటాయి. ఒకటి రిపబ్లికన్, రెండోది డెమోక్రటిక్. ఈ రెండూ తమ తమ అభిప్రాయాలు వ్యక్త పరుస్తూ ఉంటాయి.


అమెరికాలో ఎవరైనా రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలి. మూడోసారి అవకాశం ఉండదు. పార్టీ అభ్యర్థిత్వానికి ఆయా రెండు పార్టీల్లోనే పదుల సంఖ్యలో పోటీ పడుతుంటారు.  అధ్యక్షుడు కావాలంటే ముందు తమ వాళ్లను ఓడించాలి. ఇందులో చివరకి మిగిలిన అభ్యర్థి ఆయా పార్టీల నుంచి బరిలో నిలుస్తారు.

 
రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ట్రంప్‌తో పాటు భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. పార్టీ అభ్యర్థిత్వంలో ఎక్కడో ఉన్న రామస్వామి ఇప్పుడు ట్రంప్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు.  కొంతమందికి మాత్రమే తెలిసిన వ్యక్తి దేశం కాదు ఏకంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.


ట్రంప్ మాదిరిగానే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వస్తున్నారు. హెచ్ 1బీ వీసాలతో పాటు అనేక సంస్కరణలు చేపడతానని ప్రకటిస్తున్నాడు. స్థానిక యువతకే అధిక ప్రాధాన్యం అంటున్నాడు. ఎఫ్డీఐ వంటి సంస్థల్ని మూసేసి.. విద్య ఆల్కహల్, ఇతర అంశాలను ప్రక్షాలన చేపట్టి ముప్పావు వంతు ఉద్యోగుల్ని తొలగించి ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గిస్తానని చెప్తున్నాడు. తన మొదటి చర్చలతో పోల్చుకుంటే  మిగతా వారిని  దాటుకుంటూ ఇప్పుడు ట్రంప్ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. గత నెల ఆగస్టు తో పోల్చి చూస్తే సెప్టెంబరులో 12 పాయింట్ల ఆదరణ పెరిగింది. దీంతో భవిష్యత్తు అమెరికా అధ్యక్షుడిని తానేనని సగర్వంగా పేర్కొంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: