ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి టీడీపీ అనుకూల మీడియా చెప్పే విషయాలు అన్ని చంద్రబాబు నాయుడు చెప్పించినట్లు కాదు. కానీ వారు టీడీపీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొన్ని పత్రికలు కొన్ని మీడియా చానళ్లు టీవీల వెంట ఉన్నారు. వెంకట కృష్ణ లాంటి జర్నలిస్టులు, టీవీ 5 లాంటి సంస్థలు టీడీపీని బలోపేతం చేయడానికి వైసీపీని ఆ పార్టీ నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒక వైపు స్టాండ్ తీసుకుని మాట్లాడతారనే అపవాదు కూడా ఉంది.  


ఒక పక్క అమరావతి లో 50 వేల ఇళ్లు ఇస్తుంటే ఆర్ 5 జోన్ ఆరిపోయే జోన్ అంటూ, తెలుగుదేశం వచ్చిందంటే తీసేస్తారనే కొంత మంది ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా దాన్ని తీసేసే అవకాశం లేదు. అసలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన పేదలకు ఇచ్చిన ఇళ్లను తీసేస్తారా అలాంటి సాహసం ఎవరూ చేయరు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో ఒక కార్టూన్ తెగ వైరల్ అవుతోంది.


ఆ కార్టూన్ టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లను తీసేసుకుంటారంటా అని ప్రచారం చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయలేదు. టీడీపీ కి సంబంధించిన వారు అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ వైసీపీ వారు ఏదో టీవీ చానళ్లో ఎవరో అంటే దాన్ని టీడీపీ వారు అన్నట్లుగా సృష్టించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇక్కడ రాజకీయం రంగులు మారి ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.


అమరావతి లో వైఎస్ జగన్ ఇచ్చిన 50 వేల పట్టాలు కూడా ఎవరూ ఎవరి నుంచి తీసుకోలేరు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన దాన్ని లాగేసుకోవడానికి ఎవరికి హక్కు ఉండదు. కానీ ఒకరిపై ఒకరు విమర్శలు మాత్రం చేసుకోవడం ఆపడం లేదు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా.. ఇతర పార్టీలపై విరుచుకుపడదామా వారిని దెబ్బ కొడదామా అనుకుంటూ ఎప్పుడూ సోషల్ మీడియాలో రెడీగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: