
ఇక్కడ ఒక యువకుడు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చాడు. 13 ఏళ్లుగా యువతిని ప్రేమించాడు. జీవితాంతం ఆమెతో కలిసి బ్రతకాలని కలలు కన్నాడు. కానీ తన కలలు కలలుగానే మిగిలిపోయాయి అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారి పల్లెలో వెలుగులోకి వచ్చింది. మురళీమోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అత్త కుమార్తెను 13 ఏళ్లుగా ప్రేమించాడు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన పెద్దలు ఒప్పుకోకపోవడంతో పలుమార్లు చర్చలు పెళ్లి వరకు వెళ్లలేదు.
మురళీమోహన్ ఎన్నిసార్లు అత్తమామలను పెళ్లి కోసం ఒప్పించేందుకు ప్రయత్నించిన వాళ్లు అంగీకరించలేదు. దీంతో మనస్థాపనతో గతంలోనే ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు మురళీమోహన్. కానీ కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత మురళీమోహన్ తల్లిదండ్రులు యువతి తల్లిదండ్రులకు నచ్చదు చెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరికి తెలియకుండా సదరూ యువతకి బలవంతంగా మరో యువకుడితో పెళ్లి చేశారు. విషయం తెలుసుకున్న మురళీమోహన్ జీర్ణించుకోలేకపోయాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.