ఒక సంవత్సరంలో జరుపుకునే 24 ఏకాదశిలలో నిర్జల ఏకాదశి ఎంతో ఎంతో స్పెషల్. ఎంతో విశిష్టమైనది. ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అని  శాస్తీయ పండితులు చెప్తున్నారు. 2025 జూన్ 6వ తేదీ నిర్జల ఏకాదశి . ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదు భక్తులు దైవిక శక్తితో తిరిగి ఐక్యం కావడానికి వారి కర్మలను శుద్ధి చేసుకోవడానికి .. వారి జీవితాలలోకి సామరస్యాన్ని మరియు సమృద్ధిని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశంగా పండితులు చెప్పుకొస్తున్నారు.  నిర్జల ఏకాదశి హిందూమతంలో ఎంతో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది .


ఒకటి కాదు రెండు కాదు దాదాపు 24 ఏకాదశిలలో ఇది అత్యంత శక్తివంతమైనది . ఈ రోజున ఆచరించే ఉపవాసం అన్ని ఏకాదశి ఉపవాసాలలో కల్లా ఎంతో ఫలవంతమైనది అంటూ పండితులు చెప్తున్నారు. 2025లో అరుదైన మరియు శుభకారమైన యోగాలు ఏర్పడం వలన ఈ నిర్జల ఏకాదశి మరింత ప్రత్యేకమైనది . జూన్ 6వ తేదీ శుక్రవారం నిర్జల ఏకాదశి . ఈరోజు ఉదయం నుంచి పక్క రోజు ద్వాదశి వరకు పూర్తిగా ఉపవాసం ఉంటే మంచిదట. తెల్లవారుజామున   నిద్రలేచి ఇల్లు వాకిల్లు  శుభ్రంగా శుభ్రపరచుకొని దేవుడు మందిరాన్ని శుభ్రంగా పూలతో అలంకరించుకొని.. భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. అంతేకాదు నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేసే వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కుతుంది అంటున్నారు పండితులు . గతంలో చేసిన పాపాలు అన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది అని కూడా అంటున్నారు .



ఈ ఉపవాసంలో కనీసం మంచినీరు కూడా తీసుకోకుండా ఉండాలి . ఏకాదశినాడు సూర్యోదయం నుండి ద్వాదశి రోజు సూర్యోదయం వరకు ఏది తినకూడదు ..తాగకూడదు.  అన్ని ఉపవాసాలలోకి ఇది చాలా పవిత్రమైనదిగా కఠినమైనదిగా చెబుతున్నారు పండితులు . అంతేకాదు పూజ అనంతరం బియ్యం - గోధుమలు - పండ్లు కాయగూరలు- పసుపు రంగు బట్టలు దానం చేయడం చాలా చాలా మంచిది అంటూ కూడా పండితులు చెప్పుకొస్తున్నారు.  అంతకంటే చాలా చాలా ముఖ్యమైనది ఉపవాసం విరమించడం . ఏకాదశి వ్రతం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఒక్కే ఉపవాసంలో 24 ఏకాదశుల పుణ్యాన్ని పొందొచ్చు.  అయితే ఈ ఉపవాసం చేయడం చాలా చాలా కఠినం . దాదాపు 24 గంటల పాటు నీళ్లు కూడా తాగకుండా ఉండాలి.  అదేవిధంగా ఉపవాసం విరమించడం కూడా చాలా ముఖ్యం.  ఇలా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉంటాయి అంటున్నారు పండితులు.




గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే . ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాల పై ఆధారపడి ఉంటుంది . ఇది కేవలం ప్రాథమిక  సమాచారం మాత్రమే దీనిని పరిగణలోకి తీసుకునే ముందు మీరు విశ్వసించే పండితులు సలహా సూచించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: