ఏప్రిల్ 23వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరొక్కసారి హిస్టరీ లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.. 

 

 జేమ్స్ బుకానన్ జననం : అమెరికా మాజీ అధ్యక్షుడు అయిన జేమ్స్ బుకానన్ 1791 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. 

 


 నాదెళ్ళ పురుషోత్తమకవి జననం  : హిందీ నాటకకర్త సరస చతుర్విధ కవితా సామ్రాజ్య దురంధరులు బహుభాషావేత్త అభినయ వేత్త అయిన నాదెళ్ళ పురుషోత్తమకవి 1863 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. వేద పండితులు ఆదర్శ ఉపాధ్యాయుడు అయిన ఈయన పత్రికా సంపాదకులుగా కూడా పనిచేశారు. తెలుగు నాటకాలు పాత్రోచిత భాషా ప్రయోగానికి ఆద్యుడు నాదెళ్ళ పురుషోత్తమ కవి. కృష్ణా జిల్లాలో జన్మించిన ఈయన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడ్డ కారణంగా హిందీ సహా పలు భాషలు కూడా నేర్చుకున్నారూ. సిద్ధేంద్రయోగి భూకైలాసం  వీధినాటకాలు ప్రభావంతో 16వ ఏటనే 1879లో అహల్యా సంక్రందనము అనే గానం చేశారు ఈయన. యక్షగానం వీధి నాటకాలు వాళ్ళు ఎక్కువగా ప్రదర్శించారు. 1888లో నాదెళ్ల రచించిన హరిశ్చంద్ర నాటకంలో పాత్రోచిత భాషా ప్రయోగం చేసి పాత్రోచిత భాషా ప్రయోగానికి దారి చూపాడు ఈయన. 

 

 శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం : 20వ శతాబ్దపు తెలుగు కథకులు విశిష్టంగా చెప్పుకోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. ఈయన  1891 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. భాషలో భావంలో తెలుగు నుడికారం లో ఉపయోగించడంలో పేరెన్నికగన్నవారు . శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జీవితం మొత్తం ఒక సంధి యుగంలో  నడిచింది. ఒకపక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉంటే పాశ్చాత్య నాగరికత మరోపక్క ఆకర్షిస్తూ ఉండదు ఆ పాత కొత్తల కలయిక తన రచనలతో ప్రతిభావంతంగా చిత్రశాల శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. 

 

 కోగంటి గోపాలకృష్ణయ్య జననం : తెలుగు నాటక రచయిత గాయకుడు అయిన కోగంటి గోపాలకృష్ణయ్య 1923 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. కొన్ని వందల గేయాలు రాసిన ఆయన ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. చిన్నతనం నుంచే నాటకాల పట్ల ఆసక్తి ఉండటం కారణంగా తన ఆసక్తికి అనుగుణంగా పాటల్ని సాహిత్య కళా రూపాన్ని తాము ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. 

 


 తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ జననం : పాలెం సుబ్బయ్య గా ప్రసిద్ధిచెందిన తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ బిజినేపల్లి పాలెం గ్రామంలో 1925 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. విద్యారంగంలో గ్రామాభివృద్ధిలో మారుపేరుగా నిలిచారు తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ. ఒక కుగ్రామము అన్ని వసతులు కల్పించడానికి పెద్దగా కృషి చేశారు. అయితే ఈయన  స్థాపించిన కళాశాలలో అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు గొప్ప కవులు గా  చలామణీ అవుతున్నారు. ఆ కాలంలోనే ఆయన సేవలను గుర్తిస్తూ జాతీయస్థాయిలో అనేక పత్రికలు ప్రత్యేక కథనాలు కూడా రచించాడు, ఇలాంటి స్వలాభాపేక్ష  ఆశించకుండా గ్రామానికి పేరుతెచ్చిన సేవ చేశారు తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ. 

 


 ఎస్.జానకి జననం : సినీ ప్రేక్షకులు అందరికీ పరిచయమైన ప్రముఖ సినీ గాయని జానకి. వివిధ భాషలలో ఎన్నో రకాల పాటలు పాడి ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు జానకి . జానకి గారు తన యాభై సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపుగా 50 వేలకు పైగా పాటలు పాడి ఎంతో పేరు ప్రఖ్యాతలు  సంపాదించారు. తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఎన్నో పాటలు పాడారు జానకి.ఇక ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాన్ని నాలుగుసార్లు అందుకున్నారు. ఈమె  1938 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. జానకి గారూ రాష్ట్ర ఉత్తమ గాయనిగా 31 సార్లు అవార్డులు అందుకున్నారు జానకి. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎస్ జానకి పాడిన పాటలు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం తో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక చిత్ర పరిశ్రమలో  ఈమె చేసిన సేవలకుగాను మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 

 

 అక్కిరాజు సుందర రామకృష్ణ జననం  : ప్రజాకవి  రంగస్థలం సినిమా నటుడు గాయకుడు అధ్యాపకుడు ఆయన అక్కిరాజు సుందర రామకృష్ణ 1949 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: