
టంగుటూరి అంజయ్య జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఎనిమిదవ ముఖ్యమంత్రి అయిన టంగుటూరి అంజయ్య 1919 ఆగస్టు 16వ తేదీన జన్మించారు. ఈయన 1980 అక్టోబర్ 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర లో కూడా పలు మంత్రిత్వ శాఖల్లో పని చేశారు టంగుటూరి అంజయ్య. కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి జననం : కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1920 ఆగస్టు 16వ తేదీన జన్మించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేశారు. 1982 నుంచి 1983 లో మొదటిసారి 1992 నుంచి 94 వరకు రెండోసారి పదవిలో కొనసాగారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు విజయ భాస్కర్ రెడ్డి. 1955లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పని చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఐదు సార్లు శాసనసభకు ఆరు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు,
శ్రావణ భార్గవి జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్యగాయని అనువాద కళాకారిణి అయిన శ్రావణ భార్గవి 1989 ఆగస్టు 16 వ తేదీన జన్మించారు. వైవిధ్యమైన గాత్రంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు శ్రావణ భార్గవి. ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు అయిన హేమచంద్ర ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కేవలం నేపథ్యగాయని గానే కాకుండా రేడియో జాకీగా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నేపథ్య గాయకులలో శ్రావణభార్గవి ముందు వరుసలో ఉంటారు. తనదైన స్వరంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఫిదా చూసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు శ్రావణ భార్గవి.
రామకృష్ణ పరమహంస జననం : ఆధ్యాత్మిక గురువు విభిన్న మతాలలో భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలను అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి రామకృష్ణ పరమహంస 1886 ఆగస్టు 16వ తేదీన పరమపదించారు. 19 వ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం లో ఈయన ప్రభావము ఎంతగానో ఉండేది.
అటల్ బిహారి వాజ్ పయి మరణం : భారత మాజీ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్ పయి 2018 ఆగస్టు 16 వ తేదీన పరమపదించారు. భారతీయ జనతా పార్టీ తరఫున దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు అటల్ బిహారీ వాజ్ పయి . దేశ సేవలో నిమగ్నమై ఆజన్మ బ్రహ్మచారి గా ఉన్నారు. 2వ లోకసభ కు మొదటి సారి ఎన్నికయ్యారు ఆ తర్వాత 3, 9 లోక్ సభ లు మినహా 14 వ లోక్ సభ ముగిసే వరకు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు అటల్ బిహారీ వాజ్ పయి . భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.