టాలీవుడ్ అగ్ర హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు వరుసగా తెలుగు హిందీ భాషలలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే పూజ హెగ్డే ప్రతి సినిమాలో ఉండాలనుకునే విధంగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మాత్రమే కాదు తెలుగులో మరికొన్ని క్రేజీ సినిమాలలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తూ ఉండడం విశేషం.

అయితే ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా నిలిచింది అని చెప్పాలి. ఏకంగా సల్మాన్ ఖాన్ మరియు వెంకటేష్ ఇద్దరు కూడా ఈ పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం ఇది సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అవ్వడానికి ప్రముఖ కారణం అవుతుంది. వెంకటేష్ తో కలిసి పూజ హెగ్డే ఎఫ్ 3 సినిమాలో ఒక పాట చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు ఆమె హీరోయిన్ గా వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు. భవిష్యత్తులో చేసే అవకాశాలు లేకపోలేదు. 

అయితే అక్కడికి సల్మాన్ ఏవిధంగా వచ్చాడో తెలియదు కానీ వీరిద్దరి మధ్య ఆమె కేక్ కట్ చేస్తూ ఉండడం ఒక్కసారిగా ఆమె అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది బుట్ట బొమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ ను వారు కన్నుల పండుగగా చేసుకోగా ఈ విధంగా విడుదలైన ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం పూజ హెగ్డే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని సినిమాలను చేస్తుంది ఇప్పటికే ఆమె తెలుగులో చేస్తున్న రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో సినిమాలను కవర్ చేసుకోవడానికి బాలీవుడ్ చిత్ర పరశ్రమలో సినిమాలు చేస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో అగ్ర హీరోయిన్ పూజ హెగ్డే నే. 

మరింత సమాచారం తెలుసుకోండి: