కొన్ని కొన్ని సార్లు మనం పాజిటివ్ గా మాట్లాడిన అది నెగిటివ్ గా కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోస్ ల విషయంలో ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము . స్టార్ హీరోస్ ని పొగిడే క్రమంలో కొన్నిసార్లు కొందరు డైరెక్టర్లు టంగ్ స్లిప్ అవుతూ ఉంటారు . ఏదో ఒక విషయాన్ని బయట పెట్టేస్తూ ఉంటారు. ఆ సమయంలో అది నెగిటివ్ గా పొట్రేట్ అవుతుంది. మరి ముఖ్యంగా రీసెంట్గా మారుతి ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి.  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్టుతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఊపిరి పీల్చుకోడానికి కూడా టైం లేదు ప్రభాస్ కి అనడంలో సందేహమే లేదు. 


త్వరలోనే "రాజా సాబ్"  సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. టీజర్ చాలా చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది . అయితే టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ డైరెక్టర్ ప్రభాస్ కి సంబంధించిన కొన్ని కామెంట్స్ చేశారు.  ఇవే ఇప్పుడు ఆయన కొంప ముంచేసినట్లయింది.  ఈ సినిమా విషయంలో హీరోయిన్ల గురించి ప్రభాస్ మాట్లాడుతూ " డార్లింగ్ ఈ సినిమాలో నాకు ఇద్దరు హీరోయిన్స్ పెట్టవా..?" అని అడిగారు. "గత సినిమాలలో తనకు హీరోయిన్స్ పెద్దగా లేరు అని.. హీరోయిన్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే టైప్ లోనే ఉన్నారు అని .. బాహుబలి తర్వాత అలా ఒక మంచి హీరోయిన్ సీన్స్ పడలేదు అని ప్రభాస్ స్వయంగా అడగడంతోనే మారుతి ముగ్గురు హీరోయిన్స్ ని పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు".



ఇది చాలా సరదాగా ..చాలా జెన్యూన్ గానే చెప్పాడు మారుతి.  కానీ కొంతమంది మాత్రం ప్రభాస్ పరువు తీయడానికి ఆయన ఇలా చేశాడు అంటూ నెగిటివ్గా మాట్లాడుతున్నాడు . ప్రభాస్ ఏదో అడిగాడు నువ్వు స్టేజ్ పై అలా చెప్పాలా..? అందరి ముందు అంటూ ఘాటుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరు ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు . ప్రభాస్ కి హీరోయిన్స్ పిచ్చి ఉందా ..? అనే విధంగా కొంతమంది కూడా ట్రోల్ చేస్తున్నారు . దీనితో రాజా సాబ్ కి కి నెగిటివ్ ట్రోలింగ్  స్టార్ట్ అయింది . ఇదంతా మారుతీ వాల్లనే అంటూ రెబల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . కొంతమంది ఛీ ఛీ మారుతి ఇలాంటివాడా..? చిన్న డైరెక్టర్ అయిన ప్రభాస్ కి ఛాన్స్ ఇస్తే ఈ విషయాన్ని బయటపెట్టి ఆయన  పరువు తీసాడు అంటూ కూసింత  ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరి కొంతమంది మాత్రం అయ్యయ్యో పాపం ప్రభాస్ హీరోయిన్ లతో రొమాన్స్ మిస్ అవుతున్నాడా..?  అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: