తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పనులను చక చకా పూర్తి చేస్తూ వస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను కూడా ఈ మూవీ యూనిట్ మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లోని మొదటి సింగిల్ ను వచ్చే వారం విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 68 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తమిళ సినిమాలలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ను ఓవర్సీస్ లో జరుపుకున్న సినిమాలలో కూలీ మూవీ రెండవ స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి మంచి టాక్ వస్తే ఓవర్సీస్ ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను అందుకునే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: