
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ అడిగినా కూడా ఓ పని మాత్రం అస్సలు చేయకుండా వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ "ఆది" సినిమా రేంజ్ లో మాస్ ఎంటర్ టైనర్ లో నటించాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఆ సినిమాలో ఆయన లవ్ - ఎమోషన్ - ఫ్యాక్షన్ అన్ని కలగలసి నటిస్తాడు . ఆ రేంజ్ లో ఇప్పటివరకు ఎన్టీఆర్ ఒక సినిమాలో కూడా నటించలేకపోయాడు.
అలాంటి ఒక సినిమా కావాలి అన్నా అంటూ ఎన్నో సార్లు నందమూరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు . కానీ నందమూరి హీరో మాత్రం ఆ కోరిక తీర్చలేకపోయాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నందమూరి అభిమానుల కళ్ళల్లో ఆనందం చూడ్డానికి అలాంటి ఒక స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రెసెంట్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 సినిమా కంప్లీట్ అవ్వగానే మరొక మాస్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఆయన మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మాస్ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న బోయపాటి శ్రీను . ప్రజెంట్ అఖంద 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న బోయపాటి శ్రీను ఆ తర్వాత ధనుష్ తో సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇదంతా ఫేక్ కంటే కొట్టి పడేస్తున్నారు ధనుష్ ఫ్యాన్స్.
కాగా ఇదే మూమెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన కమిట్ అయిన సినిమా ఇన్నాళ్ళకి ఫైనలైజ్ కాబోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . దమ్ము సినిమా తర్వాత బోయపాటికి ఛాన్స్ ఇవ్వడానికి చాలా భయపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్ . కానీ ఒక స్క్రిప్టు మాత్రం ఆయనకు బాగా నచ్చేసిందట . బోయపాటి శ్రీను రాసుకున్న ఒక కథ చాలా చాలా బాగుందట . ఆ స్టోరీ ఎప్పటికైనా చేద్దామంటూ మాటిచ్చారట తారక్. ఇన్నాళ్ళకు ఆ మాట నిలబెట్టుకోబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . సినిమా కంప్లీట్ అవ్వగానే బోయపాటి ఎన్టీఆర్ కాంబోలో సినిమా తెరకెక్కబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఆ సినిమా పూర్తిగా రొమాంటిక్ - యాక్షన్ - ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట . పక్కాగా చెప్పాలి అంటే ఆది సినిమాకి సీక్వెల్ . అలాంటి ఒక సినిమా రావాలి అంటే ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిటింగ్. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరబోతుంది . దీని పై అఫిషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్..!??