
`డాన్`.. బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్. ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన డాన్, డాన్ 2 చిత్రాలు బాలీవుడ్ ను ఓ రేంజ్ లో షేక్ చేశాడు. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్ర ఫ్రాంచైజీలలో డాన్ ఒకటి. కొద్ది రోజుల క్రితం `డాన్ 3` కూడా ప్రకటించబడింది. అయితే ఈసారి డైరెక్టర్ ఫర్హాన్ షారుఖ్ కాకుండా డాన్ గా రణ్‌వీర్ సింగ్ ను తీసుకొచ్చాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా ఎంపిక అయింది.
రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించనున్న ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. డాన్ 3లో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. రణ్‌వీర్ పాత్రకు ధీటుగా విలన్ పాత్రను డిజైన్ చేశాడట ఫర్హాన్. ఇటీవల ఆ పాత్ర కోసం మేకర్స్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను సంప్రదించడం కూడా జరిగిందట. ఇక కథలో స్ట్రాంగ్ క్యారెక్టర్ కావడం వల్ల విజయ్ డాన్ 3లో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.