తమిళ నటుడు విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఈయన తాను నటించడం ఎన్నో సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈయన రెడ్ ఫ్లవర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది.

దానితో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఈవెంట్ ను మేకర్స్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా విశాల్ సినిమా రివ్యూల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా విశాల్ మాట్లాడుతూ ... కొంత మంది థియేటర్ల వద్ద ప్రేక్షకుల నుండి రివ్యూలను తీసుకుంటున్నారు. అలా థియేటర్ల వద్ద ప్రేక్షకుల నుండి రివ్యూలను తీసుకోవడం మానుకోవాలి అని విశాల్ చెప్పుకొచ్చారు. థియేటర్ల యాజమాన్యం కూడా యూట్యూబర్లను  మరియు రివ్యూవర్లను థియేటర్ల వద్దకు అనుమతించకూడదు అని ఆయన రెడ్ ఫ్లవర్ సినిమా ఈవెంట్ లో భాగంగా కోరారు. రివ్యూల వల్ల మూవీ లకు సరైన ఆదరణ లభించడం లేదు అని , మూవీ ని బతికించుకునేందుకు కనీసం సినిమా విడుదల అయిన తర్వాత తొలి మూడు రోజులు పూర్తి అయ్యే వరకు యూట్యూబర్లను థియేటర్ల వద్దకు అనుమతించకూడదు అని ఆయన రెడ్ ఫ్లవర్ సినిమా ఈవెంట్లో భాగంగా చెప్పుకొచ్చారు.

ఇకపోతే విశాల్ చాలా కాలం క్రితం మద గజ రాజా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితం విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే విజయాన్ని అందుకుంది. మరి రెడ్ ఫ్లవర్ సినిమాతో విశాల్ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: