
డిసెంబర్ ఐదవ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులను చకచకా కంప్లీట్ చేస్తున్నాడు మారుతి. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు.. మూవీ రిలీజ్ అవ్వలేదు అప్పుడే మరొక పాన్ ఇండియా స్టార్ తో సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మారుతి. ఆల్రెడీ ఆయన ఈ స్టోరీని ఆ పాన్ ఇండియా స్టార్ కి వివరించేసారట . ఆయన కూడా ఓకే చేశారట .
అన్ని కుదిరితే కాల్ షీట్స్ అడ్జస్ట్ అయితే మాత్రం ఆ పాన్ ఇండియా స్టార్ట్ తో మారుతి సినిమా ఫిక్స్ అయిపోయినట్లే. ఇంతకీ ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరు అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు "న్యాచురల్ స్టార్ నాని". ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..ఆ తరువాత పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న నాని .. మారుతి కాంబోలో ఓ సినిమా రాబోతుంది అంటూ తెలుగు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా సెట్ అయితే అటు నానికి ఇటు మారుతికి ఇద్దరికి క్రేజీ హిట్ తమ ఖాతాలో పడ్డటే. ఆల్ రెడీ వీళ్ల కాంబోలో "భలే భలే మగాడివోయ్" సినిమా వచ్చి హిట్ అందుకుంది..!!