పాపం నాగ వంశీ కష్టాలు చూస్తూ ఉంటే దరిద్రం ఆయన చుట్టూ వైఫైలా తిరుగుతుంది అని అనుకుంటారు. ఎందుకంటే ఒక హిట్ వచ్చింది అని ఆనందపడే లోపే మరో దరిద్రం వచ్చి ఆయన నెత్తి మీద కూర్చుంటుంది. ఎందుకంటే గుంటూరు కారం ప్లాప్ తో  నష్టాల పాలైన నాగ వంశీకి మ్యాడ్ స్క్వేర్ మూవీ నిలబెట్టింది. ఇక రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్, వార్ 2 మూవీలు నిరాశపరిచినప్పటికీ కొత్త లోక మూవీ ఆయన పంట పండించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో నాగ వంశీ నష్టాల నుండి బయటపడ్డారు అని ఆనందపడ్డారు. అయితే ఈ ఆనందం ఎంతసేపో లేదు.ఎందుకంటే మరో కొత్త చిక్కచ్చి పడింది. ఈ కొత్త చిక్కు వల్ల నాగ వంశీకి 10 కోట్లు బొక్క.. ఇక అసలు విషయంలోకి వెళ్తే..నాగ వంశీ గౌతమ్ తిన్నానూరితో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ తెరకెక్కించే కంటే ముందే మ్యూజిక్ అనే మూవీని తీశారు.

అయితే ఈ సినిమా కింగ్డమ్ కంటే ముందే విడుదలవ్వాల్సి ఉండేది.కానీ రీ టేక్స్, రీ షూట్ అని పదేపదే ఈ సినిమాని చేయడంతో ఆ సినిమా వాయిదా పడింది. దాంతో మ్యూజిక్ మూవీ కంటే ముందే కింగ్డమ్ మూవీ వచ్చి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మరోవైపు ముందే విడుదవ్వాల్సిన మ్యూజిక్ మూవీ అటకెక్కడంతోపాటు కింగ్డమ్ సినిమా తర్వాత నాగ వంశీ గౌతమ్ తిన్ననూరిల మధ్య చెడింది అనే టాక్ కూడా వినిపిస్తుంది. అలా గౌతమ్ తో గొడవలు ఉన్న నేపథ్యంలో మ్యూజిక్ మూవీ ని హోల్డ్ లో పెట్టేసారట. దాంతో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ నాగ వంశీ నెత్తిన వచ్చి కూర్చున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకి నాగవంశీ ఇప్పటికే 10 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. ఇప్పట్లో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు కాబట్టి నాగ వంశీ కి 10 కోట్ల నష్టం వచ్చింది అంటూ మాట్లాడుకుంటున్నారు.

 అయితే మ్యూజిక్ సినిమా విషయంలో అంచనాలు లేకపోవడంతో పాటు రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ మూవీ ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక ఈ సినిమాని కనీసం ఓటీటికి అమ్మినా కూడా తీసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో నాగ వంశీకి పెద్ద బొక్కే అంటూ చాలామంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి మ్యూజిక్ సినిమా అటకెక్కినట్లేనా.. దీనివల్ల నాగ వంశీ 10 కోట్లు నష్టపోవాల్సిందేనా అనేది చూడాలి.ఇక మ్యూజిక్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో సారా అర్జున్ లీడ్  పోషించింది. ఇక ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించడంతో అప్పట్లో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఈ సినిమాని పట్టించుకునేవారు కూడా ఎవరూ లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: