తెలంగాణాలో ప్రత్యేక తెలంగాణాను సాధించిన తర్వాత కేసీఆర్ ఇంకా పవర్ ఫుల్ నాయకుడిగా ఎదిగాడు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక నుండి అపోజిట్ సంకేతాలు కనిపించాయి. ఇక అప్పటి నుండి తెరాస పడుతూలేస్తూ వస్తోంది. కానీ గత సంవత్సరం అక్టోబర్ లో జరిగిన మరో ఉప ఎన్నిక హుజురాబాద్ మాత్రం తెరాస ను బాగా బలహీనపరిచింది. సొంత పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ ను ఏవేవో ప్రయోగాలు చేసి సాగనంపారు. దీనితో రాజేందర్ బీజేపీలో కలిసి తెరాస పై తన బాణాన్ని సంధించారు. దాని ఫలితంగా హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరపున రాజేందర్ తెరాస పై గెలుపు సాధించారు. అయితే ఇందులో ఎలాగైనా గెలవాలని తెరాస చేయని ప్రయోగం లేదు. ఏకంగా దళిత బంధు లాంటి పథకాన్ని పెట్టి కోట్లు ఎర వేసినా, అక్కడ ఒక్కో ఓటు కోసం 6 వేలు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది.

ఇక ఈ గెలుపుతో తెలంగాణ లో తెరాసకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉందని ప్రచారం జోరుగా జరిగింది. ఇక రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మారినప్పటి నుండి గట్టిగా తెరాస వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇలా వీరి మధ్యన తెరాస అంతర్మథనంలో పడింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు కనుక జరిగితే తెరాస గెలవడం దాదాపు అసాధ్యమేనని మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఏకంగా ఒక సర్వే ప్రకారం తెరాస కు కేవలం 40 ఎమ్మెల్యే సీట్ లను మాత్రమే దక్కించుకుంటుందని తెలిపి బిగ్ షాక్ ఇచ్చింది. ఇక ప్రశాంత్ కిషోర్ కూడా తెరాస కు హెచ్చరికలు చేస్తున్నాడు.  రెండవ సారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు సరిగా పనిచేయడం లేదని చెప్పడంతో ఈ విషయంలో కేసీఆర్ ఆలోచనలో పడ్డారు.

దీనిని బట్టి కేసీఆర్ ఈ సారి ఎన్నికలకు ఇప్పుడు గెలిచినా ఎమ్మెల్యే లలో 40 మందికి టిక్కెట్లు ఇవ్వబోయేది లేదని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే చాలా వరకు పార్టీలో తిరుగుబాటు జరిగే ప్రమాదం ఉంది. జరిగే ఏంన్నికల్లో గెలుపో ఓటమో అనేది ఎవరూ ఊహించలేము. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తెరాస ఓటమి చెందుతుంది. మరి దీనికి కేసీఆర్ ఏ విధమైన ప్రణాళికలు చేయుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.








మరింత సమాచారం తెలుసుకోండి: