గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణం అవుతుందంటూ పలు రకాల వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన కూటమిలో భాగంగా చాలామంది నేతలు ప్రవేటికరణం కాకుండా అడ్డుకుంటామంటూ తెలియజేశారు. అయితే తాజాగా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఎంపీ శ్రీ భరత్ ఈ విషయం పైన స్పందిస్తూ అవును తొలగించిన మాట వాస్తవమే కంపెనీ మేనేజ్మెంట్ అవసరమైన వారిని మాత్రమే ఉంచి మిగతా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించామంటూ తెలిపారు ఎంపీ భరత్.


మళ్లీ స్టీల్ ప్లాంట్ ను లాభాలను తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని.. బ్లాస్టు ఫర్నిస్ త్రీ ప్రారంభించినప్పుడు అవసరమైతే కచ్చితంగా కార్మికులను మళ్లీ తిరిగి తీసుకుంటామంటూ తెలియజేశారు. అయితే అలా తీసుకునే వారిలో సమర్థవంతంగా పనిచేసే వారు ఎవరైనా ఉంటే తిరిగి తీసుకోవాలంటు అక్కడ మేనేజర్లకు కూడా వివరంగా తెలియజేశారని తెలిపారు ఎంపీ భారత్. స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు కార్మికుల యాజమాన్యంతో కూడా కలిసి పని చేయవలసిన అవసరం ఉందని వెల్లడించారు.


ఇప్పటివరకు జరిగిన కొన్ని లోపాలను సైతం సరిదిద్దుకునేలా మేనేజ్మెంట్ కి అవకాశాలు కల్పించామని స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగానే ఉందంటూ తెలిపారు ఎంపీ భరత్. గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు స్టీల్ ప్లాంట్ లో కనిపిస్తున్నాయని కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేనేజ్మెంట్ కూడా చర్యలు చేపడుతోంది అంటూ తెలియజేశారు.. కూటమి  ప్రభుత్వం వచ్చిన తరువాతే స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారాలు అందుతున్నాయి అంటూ తెలియజేశారు భరత్. మొత్తానికి స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులను సైతం తొలగించారని విషయం తెలియజేశారు. మరి వీటి వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తాయని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: