నిన్నటి రోజున ఎక్కడ చూసినా కూడా అహ్మదాబాద్ లో జరిగిన విమాన పేలుడు సంఘటన గురించి ఎక్కువగా వార్తలు వినిపించాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కి వెళుతున్నటువంటి  ఎయిర్ ఇండియా 171 విమానం మధ్యాహ్న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై చాలామంది నిపుణులు విశ్లేషించడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు.. ప్రయాణికులలో 169 మంది ఇండియన్ 53 మంది బ్రిటీష్ జాతీయులు ,7 మంది పోర్చుగీస్ వారు ఉన్నారట.


విమాన ప్రమాదం గురి అవ్వడానికి ముందు 825 అడుగుల ఎత్తులోనే ఉన్నట్లుగా గుర్తించారు.. అలాగే ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్ కోల్పోయింది అంటూ తెలుపుతున్నారు. అనంతరం ఒక్కసారిగా భారీ శబ్దంతో ఈ విమానం కుప్పకూలిపోయిందని సమాచారం.


ఈ సందర్భంగా పౌర విమాన శాఖ వర్గాల నుంచి స్పందించిన సమాచారం మేరకు ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పైలెట్ నుంచి ATC మేడే కాల్ వచ్చిందంటూ తెలియజేశారు. అయితే తిరిగి పైలెట్ కు సంప్రదించే ప్రయత్నం చేసిన స్పందనలేదని తెలిపారు.

ఈ విమానంలో 80 నుంచి 90 టన్నుల ఇంధనం ఉందని దీనివల్ల విమానం నేలను ఢీకొట్టినప్పుడు మరింత ప్రమాదం తీవ్రంగా పెరిగింది అంటూ తెలుపుతున్నారు. ఇక పైలట్ కూడ ఆ ఫ్యూయల్ ను డంపు చేసే సమయం కూడా లేకుండా పోయిందని తెలుపుతున్నారు.



అయితే మరి కొంతమంది నిపుణులు కూడా పక్షులు ఢీ కొట్టడం వల్ల ఎక్కువ ఎత్తు  ఎగర లేకపోయి బిల్డింగును ఢీ కొట్టిందంటూ తెలుపుతున్నారు.


ప్రమాదానికి గురైన ఈ ఎయిర్ ఇండియా విమానం జనం వాసాలలో పడటం జరిగింది. ఇక అలా పడిన బిజీ మెడికల్ కాలేజీ లో ఐదు మంది మెడికల్ విద్యార్థులు మృతి చెందారు.

మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున టాటా సంస్థ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: