
అంతేకాదు ఏకంగా చిన్నపాటి గొడవలకే కట్టుకున్న వారిని దారుణంగా హత మారుస్తున్న దారుణమైన ఘటన లు కూడా నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చి అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భర్తతో గొడవ జరిగింది అనే కారణంతో వివాహిత ఇద్దరు పిల్లలతో సహా నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో ఆమె ఆచూకి కోసం ఎంత వెతికినా కనిపించలేదు. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది. దీంతో భర్త పుట్టింటివారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారూ. ఈ ఘటన విశాఖ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
అల్లిపురం మండలం మహారాణి పేట తాడి వీధికి చెందిన లీలావతికి 12 సంవత్సరాల క్రితం శాంత రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు పాప కూడా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సాఫీగా సాగిపోతున్న సంసారంలో ఐదేళ్ల క్రితం గొడవలు జరిగాయి. ఇక తరచూ గొడవలు జరుగుతూ ఉండటంతో లీలావతి తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఐదేళ్లుగా అక్కడే ఉంటుంది. అయితే ఇటీవలే ఈ నెల 27వ తేదీన తన ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది సదరు మహిళ. దీంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎంతకీ ఆమె ఆచూకీ లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.