మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మేమే తెచ్చుకున్నామని తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. అయితే దీనిపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది అలా పెట్టుకునే వారికి అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అంతే కాకుండా ఆ మెడికల్ కాలేజీలకు దాదాపు 50 శాతం వరకు కేంద్రం వాటా ఇస్తుంది.


కానీ తెలంగాణలో మాత్రం కేంద్ర సహకరించకున్నా తామే మొత్తం మెడికల్ కాలేజీలు నిర్మించుకుని నడిపిస్తున్నామని చెబుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మెడికల్ కాలేజీల్లో పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఇళ్లను ఇవ్వడం లేదు. రాష్ట్రంలో కట్టే ఇండ్లు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వమే కడుతుందన్నారు. అయితే తాజాగా కొత్తగా డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి బీఆర్ఎస్ ఇచ్చిన ఒక స్టేట్ మెంట్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగంలో దాదాపు ఒక ఇంటికి రూ. 2.80 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.


అయితే కేంద్రం అందించే ఈ సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఖాళీ జాగాలకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నప్పటికీ ఇళ్ల నిర్మాణంలో మాత్రం కేంద్రం పాత్ర ఉందని తెలిసిపోతుంది. ఇలా రాష్ట్రం కేంద్రం రెండు కలిపి చేసే పథకాల్లో చాలా వాటిల్లో కేంద్రానికి పేరు రాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే తామే చేసినట్లు ప్రజలకు చెబుతున్నాయి.


కానీ ఏ పథకంలో నైనా కేంద్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వ వాటా అని ఉంటుంది. వాటి గురించి ప్రశ్నించకుండా ఇలా చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం ఇలాంటి విషయాలపై ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR