
మదర్ సెంటిమెంట్ తోనే సినిమా కథ మొత్తం తిప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కే జి ఎఫ్ సినిమా లో రాఖీ బాయ్ తల్లిగా నటించిన అమ్మాయి పేరు అర్చన జోయిస్. అర్చన సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి తన నటనతో అందరినీ మెప్పించింది. చిన్న వయసులో అయినప్పటికీ హీరో యష్ కి తల్లి పాత్రకు అడగడంతో ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పాన్ ఇండియా సినిమా అని ఓకే చెప్పింది. ఇక ఈ సినిమా ద్వారా ఆమె ఊహించిన కంటే ఎక్కువగానే గుర్తింపు రావడం గమనార్హం.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన తనకు సంబంధించిన అనేక విషయాలను గురించి కూడా కొన్ని విషయాలను తెలిపింది. అర్చన తల్లిదండ్రులు శ్రీనివాస్, వీణ. వీరిద్దరూ కూడా టీచర్లు కావడం గమనార్హం. అర్చన తల్లిది ఈ సినిమా కథతో తీసిన కోలార్ ప్రాంతం . అర్చన పుట్టి పెరిగింది కూడా కోలార్ లోనే అంటూ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక అర్చన ఫైన్ ఆర్ట్స్లో పీజీ కూడా పూర్తి చేసింది. ఇక ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉంది అని, ఆమెకు తెలుగు హీరోలు అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చింది. ఇక రామ్ చరణ్ , అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది అర్చన.