సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోతో సినిమా అనుకున్నాక సినిమా సెట్స్ పైకి వెళ్లేసరికి ఆ హీరో బదులు ఇంకొక హీరో వస్తూ ఉంటారు. అలా అమిగోస్ సినిమా విషయంలో కూడా జరిగిందని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు లేదా దర్శకులు తమ కెరియర్లో దూసుకుపోవాలి అంటే టాలెంట్ తో పాటు అదృష్టం, అవకాశాలు కూడా చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటాయి. ఒక హీరోతో సినిమా అనుకున్నాక ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లేసరికి ఆ హీరో ప్లేస్ లో మరొక హీరో వస్తూ ఉంటారు.. కథలో ఈ విషయంలో కూడా అలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక కథకు దర్శకుడు ఓకే అయిన తర్వాత కూడా ఒక్కోసారి దర్శకులు ఆ కథ నుంచి తప్పుకోవడం వేరే దర్శకుడితో సినిమా పూర్తి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మొదట అమిగోస్ చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో తీయాలని అనుకున్నారు.  కానీ అర్జున్ రెడ్డి,  డియర్ కామ్రేడ్ స్క్రిప్ట్ లపై ఎక్కువ ఆసక్తి చూపించడం వల్లే ఆయన ఈ సినిమాకు నో చెప్పారని సమాచారం.  ఆ తర్వాత అమిగోస్ సినిమా స్క్రిప్టు కొన్నేళ్లపాటు పలు హీరోలకు చెప్పారట దర్శకులు. అయితే ఎవరూ కూడా ఈ కథ పై అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.

చివరికి నందమూరి కళ్యాణ్ రామ్ దగ్గరకు ఈ సినిమా కథ చేరుకుంది.  ఆయనకు స్క్రిప్ట్ కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసారు. అలా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో అమిగోస్ సినిమాను తెరకెక్కించారు ఇప్పటికే ట్రైలర్ విడుదలవగా మంచి స్పందన లభించింది.ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: