
ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే నటిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను ఇటీవల ప్రకటించడంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన అంటే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి రెడీ అయ్యాం అంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక ప్రభాస్ ఏకంగా ఇద్దరు మెగా హీరోలకి ఎసరు పెట్టాడు అన్న వార్త వైరల్ గా మారిపోయింది.
ఇది రేస్ లో పాన్ ఇండియా హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్లు కూడా ఉన్నారు. వారిద్దరు నటిస్తున్న సినిమాలు కూడా వచ్చే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావచ్చు అని గట్టిగా టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్టు కే అనౌన్స్ చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే ఇద్దరు మెగా హీరోల సినిమాల రిలీజ్ డేట్లను కూడా మార్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. మొత్తంగా ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మాత్రం ఇద్దరు మెగా హీరోలకు షాక్ ఇచ్చి తమ సినిమాలను ఆలస్యంగా రిలీజ్ చేసుకునే పరిస్థితిని తీసుకువచ్చింది అని చెప్పాలి.