బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి మకాం మార్చి స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ప్రియాంక చోప్రా. ఇక అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఈమె త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్వరలోనే సినిమా లు మనేస్తుందా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది .తమిళ సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది .ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లతో బిజీగా మారింది. తాజాగా లవ్ అగైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ప్రస్తుతం ఈమె హెచ్ ఆఫ్ స్టేట్ అని ఒక హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది .అయితే త్వరలోనే ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని తెలుస్తోంది. ఇక ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన బిడ్డ కోసం సినిమాలో మానేస్తోందన్న వార్తలు వినబడుతున్నాయి. నాలుగు పాదుల వయస్సులో కూడా ఏమాత్రం తగ్గని అందంతో హాట్ హాట్ గా కనిపిస్తోంది ఈమె .అంతలా తన అందాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇక ఈ వయసులో సినిమాలు చేయడం కంటే

ఒకానొక కూతురు మాలతి మేరీ చోప్రా ను చూసుకోవడానికి ఆమె ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. తన బిడ్డతో ఎంజాయ్ చేస్తోంది ఈమె. ఆమె ఎదుగుదల చూడడం పెరిగే కొద్దీ ఆమెకు కావలసిన అవసరాలు చూసుకోవడం ఇలాంటి విషయాలకు ఆమె ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తోంది అందుకే త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందట. గతంలో ఒకసారి  మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె ఇదే చెప్పుకొచ్చింది. నా కూతురు కోసం సినిమాలో మానుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఎటువంటి ఆలోచన చేయకుండా సినిమాలు ఆపేస్తాను అంటూ ఒక సమయంలో చెప్పింది ప్రియాంక చోప్రా. వేరే దేశంలో స్థిరపడతాను అంటూ కూడా వెల్లడించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: