" గేమ్ ఛేంజర్ " సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటి రైడ్స్ ఏ రేంజ్ లో హీట్ పెంచేస్తాయో అందరికీ తెలిసిందే.  అప్పటినుంచి చాలామంది స్టార్స్ తమ రెమ్యూనరేషన్ డీటెయిల్స్ ను బయటపెట్టాలి అంటే భయపడిపోతున్నారు . తాజాగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎదుగుతున్న ఆకాశ భాస్కరన్ ఇంట్లో ఐటి రైడ్స్ జరుగుతున్నాయి . గత రెండు రోజులుగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు . దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు న్యూస్ మీడియాలో వస్తూనే ఉంది . చెన్నైలోనే తేనంపేటలో ఉన్న ఆయన ఇంట్లో నిన్న ఉదయం 6:15 నిమిషాలకు ఐటీ సోదాలు జరిగాయి .


అయితే ఈ సోదాలు ఆయనకు సంబంధించి చాలా బ్లాక్ మనీ బయటపడినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆకాశ భాస్కర్  అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ మొదలుపెట్టారు . ఆ తర్వాత ధనుష్ నిర్మించిన "నానుం రౌడీ దాన్" సినిమాలో విగ్నేశ్ శివన్ కి అసిస్టెంట్ గా వర్క్ చేశారు . ఆ తర్వాత పలు చిత్రాలకు కూడా నిర్మాణం వహించారు . సొంతంగా నిర్మాణ సంస్థ నడుపుతున్న ఆకాష్ తన ఇంట్లో కీలక ప్రాపర్టీ కి సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు దొంగ సొమ్మును కూడా దాచాడు అన్న న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.



అంతేకాదు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమంది స్టార్ హీరోల ఇళ్ళపై ఐటి దాడులు జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నాని ఇంటిపై ఐటి రైడ్శ్ జరిగేందుకు సర్వం సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా కోర్టు , హిట్ 3 మూవీ బ్యాక్ టు బ్యాక్ హిట్టు అవ్వడం నాని సిస్టర్ ప్రొడ్యూసర్ గా ఉండడం తో నాని ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు నాని ఇంటిపై ఐడి రైడ్స్ జరగబోతున్నట్లు ఓ న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే నాని చాలా చాలా నిజాయితీపరుడు అని ..టాక్స్ సక్రమంగా కడతాడు అని ఎప్పుడు ఐటీ సోదాలు  చేసుకున్న నానికి ఏం ప్రాబ్లం లేదు అంటున్నాను ఫాన్స్ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: