మాజీ సీఎం వైఎస్ జగన్ 2029 సంవత్సరంలో వైసీపీకి కచ్చితంగా అధికారం దక్కుతుందని భావిస్తున్నారు. జగన్ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో కూటమి సర్కార్ ఫెయిల్ అయిందనే విమర్శ ఉంది. గ్రామాల్లో సైతం జగన్ పాలన బాగుందనే ఒకింత ప్రచారం జరిగింది. ఏడాది పాటు కూటమి సర్కార్ సంక్షేమ పథకాలకు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
 
కూటమి పాలనలో వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేతలు జైళ్ల పాలవుతుండటం ఒకింత సంచలనం అవుతోంది. వైసీపీ నేతలు అరెస్ట్ అయితే బెయిల్ రావడం కూడా కష్టమవుతోంది. అయితే జగన్ తాజాగా చేసిన కామెంట్లు ఒకింత సంచలనం అవుతుండటం గమనార్హం. కలియుగంలో పాలిటిక్స్ అంటే భయం ఉండకూడదని ఆయన అన్నారు.
 
తెగువ, ధైర్యం ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలమని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలిటిక్స్ అలా ఉన్నాయని జగన్ తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి రాక్షస రాజకీయాలు చేయలేదని జగన్ వెల్లడించారు. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే ఆ పార్టీ సభ్యులను లాక్కోవడానికి ఆసక్తి చూపలేదని ఆయన అన్నారు.
 
ప్రస్తుతం కుప్పంతో మొదలు పెడితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలే అని జగన్ వెల్లడించారు. రామగిరి ఉపఎన్నికలో జరిగిన అరాచకాలకు అంతే లేదని జగన్ తెలిపారు. ఏ ప్రభుత్వంపై అయినా వ్యతిరేకత రావడానికి సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కొంతకాలంలోనే చంద్రబాబు పాలనపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిందని జగన్ కామెంట్లు చేశారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: