ఈ ఏడాది రిలీజ్ కానున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో వార్2 సినిమా ఒకటి కాగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. ఇప్పటికే వార్2 సినిమా కోసం థియేటర్లను బ్లాక్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. కూలీ సినిమా నుంచి గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. వార్2 ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారని తెలుస్తోంది.
 
వార్2 సినిమాలో తారక్ రోల్ ఎలా ఉండబోతుందనే కన్ఫ్యూజన్ అభిమానుల్లో నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు పని చేసిన క్యాస్టూమ్ డిజైనర్ ఆ అనుమానాలకు చెక్ పెట్టే విధంగా కీలక వ్యాఖ్యలు చేసి కీలక విషయాలను వెల్లడించారు. వార్2 సినిమాలో తారక్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఎన్నో కోణాలు ఉన్నాయని క్యాస్టూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా కామెంట్లు చేశారు.
 
వార్2 సినిమాలో తారక్ పాత్ర కోసం చాలా లుక్స్ డిజైన్ చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆగష్టు నెల 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అనైతా ష్రాఫ్ మాట్లాడుతూ తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సెట్లోకి వస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుందని ఆమె కామెంట్లు చేశారు.
 
జూనియర్ ఎన్టీఆర్ లో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందని అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాలో ఆయన పాత్రలో ఎన్నో కోణాలు దాగి ఉంటాయని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఅర్ పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించే విధంగా ఎన్నో విభిన్నమైన క్యాస్టూమ్స్ డిజైన్ చేశామని ఆమె చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఒక లక్ష్యంతో పని చేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేస్తున్నామని ఆమె అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: