
రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాకు ఉన్న నెగిటివిటి మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పడానికి ఇదే ప్రధాన అంశంగా మారిపోయింది. కాగా కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు..? అసలు ఈ ఈవెంట్ లో ఎవరెవరు మెరవబోతున్నారు..? అనేది గత కొద్ది రోజులుగా బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది. దీనిపై రీసెంట్ గానే ఒక క్లారిటీ బయటకు వచ్చింది .
జూన్ 21వ తేదీ గ్రాండ్గా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అది కూడా హైదరాబాద్ లోనే . దీనికోసం మేకర్స్ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారట . ఈ ఈవెంట్లో దాదాపు సినిమాలో నటించిన ప్రతి ఒక్క స్టార్ కూడా కనిపించేలా జాగ్రత్త పడుతున్నారట . అంటే మోహన్ లాల్, కాజల్ , అక్షయ్ కుమార్, శరత్ కుమార్ కూడా హాజరవుతారు అంటూ తెలుస్తుంది . అంతేకాదు వీరితోపాటు చీఫ్ గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ సూపర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ కూడా అటెండ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట . ఇప్పటికే ప్రభాస్ కి దీనిపై రిక్వెస్ట్ కూడా చేశారట . ప్రభాస్ కూడా ఓకే చెప్పారట . మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది . ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత హైలెట్ గా చేస్తారు అనేది..?? ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది . చూడాలి మరి కన్నప్ప సినిమా అభిమానులను ఎలా ఆకట్టుకుంటుందో..???