రెండు రోజుల క్రితం నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి 9 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు మైనర్లు ప్రవేశించారు. శుక్రవారం వారిని భారత సైన్యం వారి స్వదేశం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (POJK)కు పంపింది. డిఫెన్స్ వింగ్ శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ విషయం చెప్పింది. పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత సైనికులు సమర్థవంతమైన నిఘా నెట్‌వర్క్ తో పని చేస్తున్నారు. ఇండియా నియంత్రణ రేఖలో అనుమానాస్పద కదలికను గమనించినట్టు ఆ ప్రకటన పేర్కొంది. ఈ నేసథ్యంలోనే ఆగస్టు 18న జరిగిన ఈ సంఘటనలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మైనర్లను  సైనికులు పట్టుకున్నారు. ఆ పిల్లలు మాట్లాడుతూ  తాము నియంత్రణ రేఖ దగ్గర ఉండే ఛత్ర, ట్రోతి ధర్మశాలలకు చెందినవారనమని చెప్పారు. నదిలో చేపలను పట్టుకోవడానికి నియంత్రణ రేఖను దాటినట్లు చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో ఇలాంటి సంఘటన జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: