అగ్ర హీరోల సినిమాల కోసం అసలైన వేట మొదలైంది. కన్నులముందు సందడి చేసే తమ మెగా హీరోల చిత్రాలు ఓటీటీ వేదికపై రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు...అటు బాలయ్య అనుగ్రహించి తన సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.... మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన సినిమా విడుదల గురించి ఎటువంటి విశేషం చెప్పకుండా అభిమానులను ఊరిస్తున్నారు. బాలయ్య నటించి దర్శకత్వం వహించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తనశాల` గత కొన్నేళ్ల క్రితం ప్రారంభ దశలోనే ఆగిపోయిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధమయ్యాయి.17 నిమిషాల వ్యవధితో చిత్రీకరించిన ఫుటేజీని శ్రేయాస్ ఈటీ ద్వారా ఈ నెల 24న రిలీజ్ చేయనున్నారు.


 
సినిమా విడుదల గురించి స్వయంగా బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే.... అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ మొత్తం చిరు సినిమాపై పడింది. బాలయ్య ... నర్తనశాల సినిమా తరహాలోనే  మధ్యలో ఆగిపోయిన మెగాస్టార్  నటించిన `అబు బాగ్దాద్ గజదొంగ` ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారా అనే టాపిక్ వైరల్ గా మారింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 90వ దశకంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఇండియన్ టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కలిసి వర్క్ చేసి తొలి భారతీయ చిత్రమిది. ఈ విషయం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో 50 కోట్ల భారీ వ్యయంతో ఈ మూవీని భారీగా ప్లాన్ చేశారు. అయితే ముస్లింలను ఉద్దేశిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం....కొంత మంది ముస్లిం నేతల ఒత్తిళ్ల కారణంగా అర్థాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఎలాంటి క్లిప్ కానీ, వివరాలు కానీ వెలుగులోకి రాలేదు. అయితే నందమూరి వారసుడు బాలకృష్ణ... చిత్రం నర్తనశాల రిలీజ్ నేపథ్యంలో..... అభిమానుల ఆకాంక్ష మేరకు చిరు కూడా అనుగ్రహించి `అబు బాగ్దాద్ గజదొంగ`  సినిమా గురించి గుడ్ న్యూస్ చెబుతారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.... కాగా మన చిరు ఎలా స్పందించన్నారో.... ఏ వార్త వినిపించనున్నారో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: