
బాహుబలి 2 : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా, అనుష్క హీరోయిన్ గా, దగ్గుబాటి రానా ప్రతినాయకుడి పాత్రలో ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమా హిందీ 510.99 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ వీ హిందీ లో 382.9 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.
దంగల్ : అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నితీష్ తివారి దర్శకత్వం లో తెరకెక్కిన దంగల్ సినిమా హిందీ లో 374.43 నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాకు ప్రితం సంగీతాన్ని సమకూర్చాడు.
సంజు : రన్బీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరని దర్శకత్వంలో తెరకెక్కిన సంజు సినిమా హిందీ లో 342.57 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో పరేశ్ రావల్ , మనీషా కొయిరాలా , విక్కీ కౌశల్ , అనుష్క శర్మ , దియా మీర్జా , సోనమ్ కపూర్ , జిమ్ సర్బ్ ఈ సినిమాలో ఇతర ముఖ్య కీలక పాత్రల్లో నటించారు.
పీకే : అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరని దర్శకత్వంలో తెరకెక్కిన పీకే మూవీ హిందీ లో 340.8 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో అనుష్క శర్మ కీలక పాత్రలో నటించింది.