ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన సార్ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయం నుండి ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. పైగా ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా గత రెండు సినిమాలు రంగ్ దే మరియు మిస్టర్ మజ్నులు పరాజయం పాలవ్వడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే వెంకీ అట్లూరికి ప్రేమకథలను తెరకెక్కించే అలవాటు మాత్రమే ఉంది. కానీ సడెన్ గా తన శైలికి భిన్నంగా కంటెంట్ ను ఎంచుకోవడంతో అందరూ సాహసం చేస్తున్నాడనే విమర్శలు చేశారు.

ధనుష్ హీరోగా మరియు సంయుక్త మీనన్ హీరోయిన్ గా సముద్రఖని , సాయికుమార్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆదిలు ఈ సినిమాలో నటించారు. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన ప్రకారం ఓ లెక్చరర్ గా ధనుష్ నటన వేరే లెవెల్ అని టాక్. సినిమా ఆద్యంతం ధనుష్ తన భుజస్కంధాలపై మోసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడట. ఈ సినిమా చూసిన ఎవరైనా ఖచ్చితంగా మంచి సినిమాను చూశాము అన్న ఫిలింగ్ తోనే థియేటర్ బయటకు వెళుతారని రివ్యూలు చెబుతున్నాయి. సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ఎవ్వరూ కనెక్ట్ కావడం లేదట. విలన్ సముద్రఖని చేసినంతలో పర్వాలేదనిపించినా... స్కోప్ లేని పాత్రను ఇచ్చారట.

ఎప్పటిలాగే సీనియర్ నటులు సాయికుమార్ మరియు తణికెళ్లభరణిలు మెప్పించారు. సినిమాలో ధనుష్ తర్వాత మరో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ నిలిచాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా నేపధ్య సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడని అతనిపై ప్రసంశలు కురుస్తున్నాయి. మొత్తానికి రెండు ఘోర పరాజయాల అనంతరం డైరెక్టర్ వెంకీ అట్లూరి సార్ తో హిట్ కొట్టాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు వెంకీ అట్లూరిని హ్యాట్సాప్ అంటున్నారట. సినిమా పరంగా టాక్ బాగున్నా కలెక్షన్ ల మీదనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. మరి ఈ సినిమా ఈ వీకెండ్ లో ఏ మేరకు వసూళ్లను అందుకుంటుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: