టాలీవుడ్ హీరోల అభిరుచి రోజురోజుకు మారిపోతుంది. హీరోగా సినిమాల్లో కనిపించడం అనే దానికి వారు అర్థం మానేస్తున్నారు అని చెప్పవచ్చు. గతంలో హీరో అంటే ఎంతో మంచి వాడు విలన్స్ భరతం పట్టే వాడు అందర్నీ కాపాడే వాడు అనే విధంగా సినిమాలలో కనిపించే వారు. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తుంటే హీరో అంటే ఇవన్నీ చేసే వాడు మాత్రమే కాదు. చెడు చేసేవాడు కూడా హీరో అన్నట్లే అని భావించేలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా లో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు కూడా హీరోను నెగెటివ్ రోల్ లో చూపించడానికి ఎక్కువగా దర్శక నిర్మాతలు ఇష్టపడుతున్నారు. అనూహ్యంగా దాన్ని ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడుతూ సదరు సినిమాలను సూపర్ డూపర్ హిట్లు చేస్తున్నారు.   దీన్ని బట్టి ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరో పాత్ర కూడా పూర్తి నెగటివ్ రోల్ అనే విషయం ఎవరూ గమనించడం లేదు. 

ఇదిలా ఉంటే మన హీరోలు కూడా అలాంటి పాత్రలో చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నానీ కూడా తన దసరా సినిమాలో విలన్ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే రవితేజ హీరోగా నటించబోయే రావణాసుర సినిమాలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నే రవితేజ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బాబి సినిమా కూడా కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఉండబోతుందట. మెగా స్టార్ కూడా ఇలా అలోచించ డం తో మరింత మంది యువ హీరోలు ఇలా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విధంగా మన హీరోలు నెగిటివ్ రోల్స్ ను ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఇప్పుడు సినిమా విశ్లేషకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: