జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మళ్ళీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన పవన్ ఆగస్టు నెల చివరి నాటికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సైతం పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సముద్రఖని డైరెక్షన్ లో పవన్ సినిమా అంటూ వార్తలు వినిపిస్తుండగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ నటించాల్సిన సినిమా సంగతి ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి నిర్మాత రామ్ తాళ్లూరి పవన్ కు ఆరేళ్ళ క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం వల్ల   నిర్మాతకు వడ్డీ భారం పెరుగుతోంది. ఈ నిర్మాత సినిమా విషయంలో  పవన్  ఏ విధంగా  ముందుకెళ్తారో చూడాలి. మరోవైపు  దర్శకుడు సురేందర్ రెడ్డి పరిస్థితి  సైతం దారుణంగా ఉంది. ఈ దర్శకుడి గత సినిమా ఏజెంట్ ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే  లేదు.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ సినిమాలను వేగంగా పూర్తి  చేయడం సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.  పవన్ సురేందర్ రెడ్డి కాంబోలో  సినిమా  తెరకెక్కితే సురేందర్ రెడ్డికి సైతం ప్లస్ అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్  విషయంలో  పవన్  మనసులో ఏముందో  తెలియాల్సి ఉంది.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పారితోషికం ప్రస్తుతం 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.  పవన కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో  బిజీ అయ్యి  భారీ విజయాలను అందుకుంటే  ఫ్యాన్స్ ఆనందానికి కూడా అవధులు ఉండవని  చెప్పడంలో సందేహం అవసరం లేదు.  పవన్  కళ్యాణ్  సంచలన విజయాలను  సొంతం చేసుకుంటే  ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: