మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న కన్నప్ప మంచు విష్ణుకు ఎంతో ప్రెస్టేజ్ సినిమా .. ప్రమోషన్ల పరంగా తన శక్తికు మించి కష్టపడుతున్న తీరు మీడియాలో కనిపిస్తుంది .. దుబాయ్ వెళ్లి మరి ఈవెంట్ చేయటం ఎంత కమిట్మెంట్ ఉందో అర్థం చేస్తుంది . అలాగే హైదరాబాదులో జరగబోయే ఈవెంట్ తో దీన్ని మరో స్థాయికి తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్న మంచు విష్ణు దానికి ప్రభాస్ న్యూ చీఫ్ గెస్ట్ గా తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు . ఇక ఇందులో ఎంతవరకు సక్సెస్ సాధిస్తాడు వేడుక జరిగే రోజే తెలియనుంది . అయితే ఇప్పుడు టాక్ ఇది కాదు . ప్రస్తుతం రీసెంట్గా రిలీజ్ అయిన కుబేరాకు వస్తున్న స్పందన కన్నప్పలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా కనిపిస్తుంది .


ఎందుకంటే గత కొన్ని వారాలుగా థియేటర్ల దగ్గర వాతావరణం చూసి బయ్యర్లు , నిర్మాతలు బాగా టెన్షన్ పడ్డారు .. ప్రేక్షకులు సినిమాలు చూసే మూడ్లో లేరని .. ఇప్పట్లో మార్పు వచ్చేలా లేదని ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి .. మరికొందరు ఏకంగా రివ్యూలు దెబ్బ కొడుతున్నయ‌ని అంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు .  ఇక ఇప్పుడు అవన్నీ తప్పని కుబేర రుజువు చేసింది .. రెగ్యులర్ మాస్ సినిమా కాకపోయినా ప్రేక్షకులు ఆదరిస్తున్న ఇతురు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది .. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన కేంద్రాల్లో 75 రూపాయల హైక్ ఇచ్చిన హౌస్ ఫుల్ బోట్స్ పడటమే దీనికి ప్రధాన కారణం .. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు మధ్యాహ్నం షోల నుంచే పెరగటం మొదలవుతుందని ఈ సినిమా ప్రూవ్ చేసింది .


ఇక ఇప్పుడు జూన్ 27న కన్నప్పకు కావాల్సింది కూడా ఇలాంటి టాక్ .. ప్రభాస్ ఇమేజ్ తో ఓపెనింగ్స్ బాగా తీసుకువచ్చిన తర్వాత లాంగ్ రాన్లో నిలబట్టాల్సింది మాత్రం మంచు విష్ణు నే..  ఇక అది తెలిసే తన వంతుగా ప్రేక్షకులకి సినిమా బాగా రీచ్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నాడు .. ఇక డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు .. ఆయన బ్రాండ్ ఉపయోగపడదు అందుకే దాన్ని హైలైట్ చేయకుండా వీలైనంత వరకు కన్నప్పకు మంచి డివోషనల్ మూవీగా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుంది .. అయితే ముందు రోజు ప్రీమియర్లు వేసే ఆలోచన లేకపోయినా .. రిలీజ్ రోజు త్వరగా షోలు మొదలు పెట్టే ఆలోచన అయితే చిత్ర యూనిట్ లో ఉందట ..

మరింత సమాచారం తెలుసుకోండి: