డ్రాగన్ దేశంలో కరోనా వైరస్ బాధితులు అంతకంతకు పెరిగిపోతున్నారు. మామూలుగా ప్రపంచదేశాల్లో కరోనావైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయిన వారిని మాత్రమే బాధితులని చెప్పుకునేవారు. కానీ చైనాలో మాత్రం నెగిటివ్ గా నిర్ధారణ అయిన వారు కూడా బాధితులేనట. అదేమిటయ్యా అంటే తమ దేశంలో అంతే అనంటోంది డ్రాగన్ ప్రభుత్వం. షాంఘైలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఐసొలేషన్ కేంద్రాలకు పంపేస్తోంది.





ఇదే సమయంలో నెగిటివ్ వచ్చిన వారిని నగరం నుండి బయటకు పంపేస్తోంది. ఎందుకంటే కరోనా సోకకుండానని డ్రాగన్ ప్రభుత్వం జనాలకు చెబుతోంది. తమ ఇళ్ళల్లో తాముంటామని జనాలు మొత్తుకుంటున్నా వినకుండా బలవంతంగా షాంఘైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతానికి పంపేస్తున్నారట. మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఇళ్ళకు ఎప్పుడు తీసుకెళ్ళేది కూడా అధికారులు చెప్పటంలేదట.





ఇదే విషయమై లూసీ అనే యువతి మాట్లాడుతు తమ కాంపౌండ్లో చాలా మందికి పాజిటివ్ వచ్చిందట. అందుకని వాళ్ళందరినీ ఆసుపత్రుల్లోని ఐసొలేషన్ కేంద్రాలక పంపేశారట. అలాగే నెగిటివ్ వచ్చిన తమను కూడా బలవంతంగా ఇళ్ళు ఖాళీచేయించి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో కేంద్రానికి పంపేశారట. ఎందుకని అడిగితే కరోనా సోకకుండా అని చెబుతున్నారట. తనతో పాటు కొన్ని వందలమందిని ఈ కేంద్రంలోని ఇరుకు ఛాంబర్లలో ఉంచుతున్నారట.





ఈ ఛాంబర్లలో ఉంచి తమను చివరకు ఏమి చేస్తారో అన్న భయం పెరిగిపోతోందని లూసీ చెప్పారు. అడిగితే సమాధానం చెప్పేవారు లేరు అలాగని ఆ కేంద్రం నుండి బయటకు వెళ్ళేందుకు కూడా లేదట. ఇప్పటికే షాంఘైలోని లక్షలాది ఇళ్ళకు అధికారులు బయటనుండి సీల్ చేసేశారు. నగరంలోని జనాభా 1.5 కోట్లమంది దాదాపు నెలరోజుల నుండి తమ ఇళ్ళల్లోనే తాము బంధీలుగా ఉన్నట్లు మొత్తుకుంటున్నారు. ఇళ్ళనుండి బయటకు కాదుకదా చివరకు కిటికీలు కూడా తీయనియ్యటం లేదట. దీనికి అదనంగా కొందరిని ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళిపోవటం. దాంతో అసలు షాంఘైలో ఏమి జరుగుతోందో ప్రపంచంలో ఎవరికీ ఏమీ తెలియటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: