రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందే అని ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నతున్నారు. ఇద్దరు రెగ్యులర్ గా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నేతలను నియోజకవర్గాల్లో పర్యటించాలని, జనాలతో మమేకమవ్వాలని, మంచి చెడ్డా తెలుసుకోవాలని పదేపదే ఆదేశిస్తున్నారు. ఇవన్నీ ఒకవైపు చేస్తునే మరోవైపు ప్రచారంమీద కూడా దృష్టిపెట్టారు. ఎంతైనా మీడియా ప్రచారంలో చంద్రబాబు ముందు జగన్ నిలవలేరన్నది వాస్తవం. రాష్ట్రంలోని మీడియాలో 90 శాతం జగన్ కు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తోంది.





అందుకనే జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సమాచారం కోసం జనాలు మీడియా మీద ఆధారపడటం ఎప్పుడో మానుకున్నారు. ఏదో కాలక్షేపం కోసమే దినపత్రికలను చదువుతున్నారు. దినపత్రికలైనా, ఛానళ్ళయినా పార్టీలవారీగా చీలిపోయిన విషయం జనాలందరికీ తెలుసు. సరిగ్గా ఈ పాయింట్ మీద సోషల్ మీడియా జనాల్లోకి బాగా చొచ్చుకుపోయింది. అందుకనే వైసీపీకి మద్దతుగా లక్షమందితో ఐటి ప్రొఫెషనల్స్ వారియర్స్ ని ఏర్పాటుచేశారు.





హైదరాబాద్ లోని హెటెక్ సిటి కన్వెన్షన్ సెంటర్లో  వారియర్స్ వింగ్ ఏర్పాటైంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వైసీపీ అభిమానులతో స్వచ్చంధంగా పనిచేసేందుకే లక్షమందితో ఈ సైన్యం ఏర్పాటైంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు విస్తృతమైన ప్రచారం కల్పించటమే వారియర్స్ ఉద్దేశ్యం. ఈ వారియర్స్ తమ ప్రచారాన్ని గ్రామీణ ప్రాంతాల నుండి మొదలుపెట్టబోతున్నారు. ఒకవైపు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తునే మరోవైపు ప్రతిపక్షాల్లోని తప్పులను ఎండగట్టడం, జనాలకు వాటిని చూపించటమే పనిగా పెట్టుకున్నారు.





కొత్తగా ఫాం అయిన లక్షమంది వారియర్స్ ఇప్పటికే ఉన్న వైసీపీ సోషల్ మీడియాకు అదనంగా పనిచేస్తుందన్నమాట. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియా బాగా పనిచేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున సోషల్ మీడియా వింగ్ రెచ్చిపోయింది. ఇపుడు జనాలు సమాచారం కోసం మీడియా మీద మాత్రమే కాదు సోషల్ మీడియాను కూడా చూస్తున్నారు. మీడియా చూపని కోణాలను  కూడా సోషల్ మీడియా జనాలకు చూపిస్తోంది. సోషల్ మీడియా ఖాతాలు కోట్లలో ఉంటున్నకారణంగా జనాలకు ఏ సమాచారమైనా క్షణాల్లో చేరిపోతోంది. అందుకనే జగన్ వ్యూహాత్మకంగా లక్షమందితో ఐటి వారియర్స్ ఏర్పాటుచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: