దేశంలోని ఆదాయపు పన్ను చట్టం, 1961 సంవత్సరంలోని సెక్షన్ 139 ఎ ప్రకారం ఒక వ్యక్తి ఒక్క పాన్ నంబర్ ను కలిగి ఉండడానికి అర్హులు. ఈ రూల్స్ ని అతిక్రమించిన వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలను తీసుకోనుంది. ఎవరికైనా ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డ్‌ లను కలిగిన వారికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా విధించాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. అయితే వివిధ కారణాల వలన ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులను మాత్రం కలిగి ఉన్నవారు తమ వద్ద అదనంగా ఉన్న పాన్‌ కార్డులను స్వాధీనం చేయటం ద్వారా ఆ పరిహారం వలన ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కలిగించింది. అయితే వారు అటువంటి కార్డులను ప్రభుత్వానికి వెంటనే తిరిగి అందచేయాలని ఆదేశాలు జారీచేసింది.

 

 


ఇందులో ముఖ్యంగా ప్రవాస భారతీయుల వద్ద ఎక్కువ పాన్ కార్డుల ఉండే అవకాశం ఉంది. అటువంటి వారు చాలా సంవత్సరాల తరువాత దేశాన్ని వచ్చిన తరువాత వారి పేరు మీద మరొక పాన్ కార్డును వారు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా వారి పాన్‌ కార్డులో ఉన్న వివరాల్లో తప్పులు ఉన్నప్పుడు వాటిని మార్చుకోవచ్చు. దీనికి బదులు కొందరు మరో కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. తొలికార్డును స్వాధీనం చేయకుండానే మరోకదాన్ని వారు పొందుతారు.

 

 

ఇలా ఏ వినియోగదారులు అయితే ఆదాయపు పన్ను విభాగం యొక్క వెబ్‌ సైట్‌ ను సందర్శించి, 'సరెండర్ డూప్లికేట్ పాన్' కింద క్లిక్ చేసి అప్పుడు మీరు స్వాధీనం చేయవలసిన పాన్ కార్డు, మీరు నిలుపుకోవాలనుకునే పాన్ కార్డు యొక్క అవసరమైన వివరాలను పూర్తి చేయాలని అడుగుతారు. ఇంకా ఆలస్యం లేకుండా ఈ విధంగా ఆన్ లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల ద్వారా తప్పని సరిగా అదనపు పాన్‌ కార్డులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: