ప్రస్తుతం కనీ వినీ ఎరుగని ఒక వార్త టెక్నాలజీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం గురించి తెలుసుకున్నారంటే ఖచ్చితంగా ముక్కున వేలేసుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఇంత కీ అసలు విషయం ఏమిటో తెలుసా ? ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీతో ఎన్నెన్ని వింతలు జరుగుతున్నాయో మనము చూస్తూనే విన్నాము. ఈ టెక్నాలజీ రంగంలో ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యమని తెలిసిన విషయమే. మనము ఉపయోగించే మొబైల్ లేదా కంప్యూటర్ లు అధిక వేగం కలిగిన ఇంటర్ నెట్ సౌకర్యం ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పనులు జరుగుతాయి. అది డౌన్ లోడ్ లు కావొచ్చు, ఏదైనా ఉద్యోగ అప్లికేషన్ లు చేయడం కావొచ్చు, ఆన్లైన్ తరగతులలో పాల్గొనడం కావొచ్చు ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోని అన్ని దేశాలు అత్యధిక వేగవంతమైన ఇంటర్ నెట్ ను అందించడానికి కసరత్తులు చేస్తున్నారు.

అయితే టెక్నాలజీ రంగంలో ఎంతో ముందున్న జపాన్ మరో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఏ దేశమూ సాధించని ఇంటర్ నెట్ స్పీడ్ ని అందుకుని చరిత్ర సృష్టించింది. ఇది ఇప్పటి వరకు టాప్ ఇంటర్ నెట్ స్పీడ్ కావడం విశేషం. క్షణాల వ్యవధిలోనే ఎక్కువ డాటాను ట్రాన్స్ఫర్ చేసి సక్సెస్ అయింది.   జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కేవలం ఒక్క సెకనులో 319 టెరాబైట్ల స్పీడ్ ఇంటర్నెట్ డాటాను పంపడంలో సక్సెస్ అయింది. ఇది దాదాపు ఒక సెకనులో 57 వేల సినిమాలను డౌన్లోడ్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. అదే మన మన ఇండియాలో మనకు ఉన్న బ్రాడ్ బ్యాండ్ లు కేవలం 512 MBPS స్పీడ్ తోనే నడుస్తున్నాయి. ఇంత స్పీడు తో ఇంటర్నెట్ ను పొందడానికి ఆప్టికల్ ఫైబర్ విధానాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం కోసం 30001 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ సెట్ ను వాడారు.  

ఇది తెలిసిన అన్ని దేశాలు జపాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండియా బ్రాడ్ బ్యాండ్ కమ్యూనిటీ వారు, ఇటువంటి అధిక వేగం కలిగిన ఇంటర్నెట్ మనకు చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇంతటి స్పీడ్ కలిగిన ఇంటర్నెట్ ను అందించడం కుదరదని, మన ఇండియాలో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య ఎక్కువ కావడమే దీనికి కారణమని ప్రముఖులు చెబుతున్నారు.  ప్రస్తుతం ఇది అంతర్జాలంలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: