ఏపీలో కీలక నేతలైన సీఎం జగన్‌, జనసేన అధినేత పవన్‌ నేరుగా ఎన్నికల్లో తలపడతే ఎలా ఉంటుంది. భలే ఉంటుంది కదా.. పవన్‌కు దమ్ముంటే అలా జగన్‌పై సింగిల్‌గా పోటీ చేయాలని వైసీపీ మంత్రి రోజా డిమాండ్ చేస్తున్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 46 ఏళ్ళకే ముఖ్యమంత్రి అయ్యార‌ని, పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు  అయిన ఎమ్మెల్యే కాదు కనీసం ఎంపీటీసీ, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేద‌ని వైసీపీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.


సీఎం వైయ‌స్ జగన్‌ను సింగ్లర్‌గా పిలవడం కాదని.. దమ్ముంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైయ‌స్ జ‌గ‌న్‌ మీద సింగిల్‌గా పోటీ చేయాల‌ని వైసీపీ మంత్రి రోజా పవన్‌కు సవాల్‌ విసిరారు. జగన్‌ పాలన చూసి ఓర్వలేక.. ఓటమి భయంతోనే దత్తపుత్రుడితో చంద్రబాబు నాయుడు విషం చిమ్మిస్తున్నాడని మంత్రి రోజా విమర్శించారు. వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్లను వైసీపీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: