ఈ రోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాజీ ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజెందర్ భూకబ్జా కేసు విచారణ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఎందుకంటే ఆ వ్యాఖ్య రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఒక్క మాటలో చెప్పకుండానే చెప్పేసింది, పరోక్షంగా తేల్చేసింది.


అస్సైన్డ్ భూములు కబ్జా చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర కుటుంబానికి చెందిన, జమునా హేచరీస్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. అచ్చంపేటలో తమ భూముల్లో అక్రమంగా సర్వే చేశారని, తమకు కనీసం నోటీస్ అయినా ఇవ్వకుండా, వివరణ అయినా కోరకుండా అదికారులు తమ భూములలోకి వచ్చారని, కలెక్టర్ నివేదిక కాపీ కూడా ఇవ్వలేదని వారు హైకోర్టుకు విన్నవించారు.


తమకు సంబందించిన భూముల్లో సర్వే చేసి బోర్డులను పెట్టారని ఉన్నత న్యాయస్థానానికి వివరించింది. మెదక్ జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎస్. హరీష్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని తమపై బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ విజిలెన్స్ మరియు మెదక్ కలెక్టర్ ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.


ఈటెల రాజెందర్ శ్రీమతి - జమునకు మరియు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన "జమున హ్యాచరీస్"‌ కేసు విచరణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.


జమున హ్యాచరీస్ ‌కు సరైన పద్ధతిలో విచారణ గురించి ముందుగా సమాచారం అందించకుండా, అధికారులతో ఆఘమేఘాల మీద విచారణ చేయించిందని, ఆ విచారణ సైతం జరగవలసిన చోట, జరగవలసిన విధంగా జరగలేదని కొన్ని పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి కారులో కూర్చొని రూపొదించిన ‘విచారణ నివేదిక’ గా దానిని వ్యాఖ్యానించింది.


నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వకుండా వారి నుండి వివరణను కోరకుండా - శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చి సోమవారం సమాధానం కోరటం - సబబుగా లేదని, అలా సమాధానం ఇవ్వమనేలా ఉండ కూడదని షరతు విధించింది. "వెనుక గేటు నుంచి కాదు.. రాచమార్గంలో వెళ్లి విచారణ జరపాలి" అని ఆదేశించింది.


అలాగే ఇప్పటి వరకు అంటే మే 1, 2 తేదీలలో జరిగిన అధికారుల స్థాయి విచారణను ఎట్టి పరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పింది. తద్వారా తయారైన ప్రభుత్వ నివేదిక కూడా చెల్లదని పేర్కొంది. అధికారులు విధివిధానాల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ప్రతి వాదులందరికీ నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


దీనిపై వాదోపవాదాల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

*నోటీసు ఇవ్వకుండా ఎవరి ఇంటిలో అయినా చొరబడవచ్చా?

*రాత్రికి రాత్రే ఈ భూ సర్వే పూర్తి చేశారా? అని న్యాయమూర్తి ప్రభుత్వ ఆడ్వకేట్ జనరల్ బి. శివానంద ప్రసాద్ ను ఆయన సూటిగా ప్రశ్నించారు.

*అధికారులు కారులో కూర్చుని నివేదిక తయారు చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.


దీనికి సమాధానంగా ప్రభుత్వ ఆడ్వకేట్ జనరల్ ఇది "ప్రాధమిక నివేదిక" మాత్రమే అని, తరువాత జరిగేవన్నీ చట్టబద్ధంగా జరుగుతాయని వివరించారు. అయితే అడ్వకేట్ జనరల్ ఇప్పటికి జరిగింది చట్టబద్ధంగా జరగలేదని ఒప్పుకున్నట్లేనా? హైకోర్టు విచారణలో ఈటల కుటుంబానికి నైతిక మద్దతు లభించినట్లే


సందర్భం వెరే అయినా హైకోర్ట్ వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా ప్రభుత్వ పనితీరుపై ప్రజా హృదయాల్లో బడబాగ్నిలా రగుల్తున్న వెదనను బ్రద్ధలు చేసింది. అమ్మయ్యా! ఇప్పటి వరకు ప్రజాబాహుళ్యం అంతరంగాల్లో గూడుకట్టుకొని రగులుతూ బ్రద్దలవుతుందేమో అన్నట్లున్న పరిస్థితుల్లో కనీసం మూడు రాజ్యాంగ వ్యవస్థల్లో కనీసం ఒక రాజ్యంగ వ్యవస్థ అదే "న్యాయస్థానం" అయినా అర్ధం చేసుకుందని సంతోషపడ్డారు.


మొత్తం మంత్రి మండలిలో పనిచేసే ఒకే ఒక మంత్రి ఈటెల రాజెందర్ అని ప్రతి ఒక్కరూ చెపుతున్న వేళ, కోవిడ్ మహమ్మారి ప్రజలపై విరుచుకు పడుతున్న వేళ, ఆయన అవసరం అనవరతమైన వేళ - ఆయన్ను ఏదో భూకబ్జా కారణం చూపించి ఆయనను పదవినుంచి తొలగించటం జనం సహించట్లేదు.


పిలిస్తే పలికే నాయకుడు రాజెందర్ ఒక్కరే అని ఇప్పటికే ప్రజలు గుర్తించారు. ఎవర్ని అడిగినా, పలకరించినా అందరి మాట ఏమంటే - ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు (కచరా) తన వ్యవసాయ క్షేత్రంలోని పొదరిల్లు తప్పితే ప్రగతి భవన్ వదలి సచివాలయానికే రారు. అలాంటి వ్యక్తికి కరోనా విషకౌగిలిలో చిక్కిచిద్రమై, పిట్టల్లా రాలిపోతున్న ప్రజల గురించి ఎంత తెలుసు? ఏం తెలుసు? అందుకే ప్రజలు ఈటెల రాజెందర్ పై సానుభూతి వర్షం కురిపిస్తున్నారు. ఒక వైద్య ఆరోగ్యశాఖా మంత్రిగా ముఖ్యమంత్రి మద్దతు లేకున్నా, తనకున్న పరిధిని పూర్తిగా వినియోగించుకుంటూ నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్నారు.


ఇప్పటికే ఆ భూముల్లో అక్రమాలు లేవని, అక్రమాలు ఉన్నాయని కోర్టులో తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని ఈటల రాజేందర్ చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రి ఆదేశించినంత వేగంగా అంటే రడీమేడ్ గా సిద్ధం చేసి ఉంచినట్లు నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు. వాటి ఆధారంగా ఈటల రాజేందర్ పై చర్యలన్నింటినీ తీసుకున్నారు.


అయితే ఆ నివేదికలు చెల్లవని, న్యాయస్థానం చెప్పినా, ఇప్పటికే ఈటల రాజేందర్ కు జరగాల్సిన నష్టం మాత్రం జరిగి పోయింది. అంతేకాదు మరో వైపు ఈటలపై టీఆర్ఎస్ నేతలు మేకవన్నే పులి అంటూ కూడబలుక్కున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి మండిపడ్డారు ఎదురు దాడి చేశారు. అయితే క్రమశిక్షణ చర్యల పేరుతో ఈటలను పార్టీ నుంచి బహిష్కరించ వచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.



భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించేసింది. అంతేకాదు ఆయన కబ్జా చేశాడని అధికారులతో నివేదిక ఇప్పించింది. కేసీఆర్ సర్కార్. అయితే ఈటల న్యాయం చేయాలని హైకోర్టు తలుపు తట్టాడు. హైకోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జూన్ 6 వ తేదీకి వాయిదా వేసింది.


ఈటల కుటుంబం వేసిన అత్యవసర పిటీషన్ పై హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ తన నివాసంలోనే విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరుఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు.


ప్రజల నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజెందర్ పై విచారణ జరపకూడదని కాదుఆరోపణలు దాదాపు 70 మందికి పైగా తెలంగాణా ప్రజా ప్రతినిధులపై వచ్చాయి అందులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులుదగ్గరి బంధువులు మిత్రులు ఆయన శ్రేయోభిలాషులు కూడా ఉన్నారు. అయితే విచారణ జరిపించే విధి విధానాలు ప్రజలందరికి ఒకేలా ఉండాలి. అందులో ఒకరిపై మిత్రత్వం మరొకరిపై శతృత్వం ప్రదర్శన కనిపించరాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: