
ఈ పథకం వల్ల పేదలకు వైద్య సేవలు మరింత నాణ్యంగా పూర్తి ఉచితంగా అందుతాయని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో అతి త్వరలో పెట్ సిటీ స్కాన్‌ను కూడా ప్రారంభించబోతున్నారని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ అవశేషాలు ఉన్నా సరే ఈ స్కాన్ ద్వారా పసిగట్టేయొచ్చని మంత్రి విడదల రజిని తెలిపారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఏపీలోనే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి విడదల రజిని వివరించారు.
దీనిపై కొద్ది రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ట్రయల్ రన్‌ను చేపట్టామని మంత్రి విడదల రజిని చెప్పారు. ఇప్పటికే 100 మందికిపైగా రోగులకు ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించామని మంత్రి విడదల రజిని తెలిపారు. 30 మందికిపైగా చికిత్స చేయించుకుని ఇంటికి కూడా చేరుకున్నారని మంత్రి విడదల రజిని వివరించారు. ఇకపై ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులందరికీ పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందుతాయని మంత్రి విడదల రజిని చెప్పారు.
ఎయిమ్స్‌కు ఇప్పుడు రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామని మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్ల నుంచి మూడేసి లక్షల లీటర్ల చొప్పున మొత్తం ఆరు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి విడదల రజిని వివరించారు. దీనివల్ల ఎయిమ్స్ లో పూర్తి బెడ్ సామర్థ్యం మేర వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. వచ్చే జూన్ కల్లా పైపు లైను పనులు కూడా పూర్తవుతాయని మంత్రి విడదల రజిని చెప్పారు.