
అయితే మొన్నటి వరకు ఇలా గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడం కోసం ఎంతోమంది రిస్కీ విన్యాసాలు చేయడం చూసాం. అమ్మో ఇలాంటి రిస్కీ విన్యాసాలు మావల్ల కాదు బాబోయ్ అని ఎంతో మంది ఇది చూసిన తర్వాత కూడా అనుకున్నారు. కానీ ఇటీవల కాలంలో మనం రోజువారి చేసే పనులను ఎవరికి సాధ్యం కాని విధంగా చేసి గిన్నిస్ బుక్ రికార్డు కూడా సృష్టించవచ్చు అని కొంతమంది నిరూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. టాటూ అనేది నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.
ఇక టాటూ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉంది అని చెప్పాలి. మంచి టాటూలు వేస్తూ ఇక ఎంతోమంది వేలు, లక్షల్లోనే సంపాదిస్తూ ఉన్నారు. కానీ ఇలా టాటూలు వేయడం ద్వారా కూడా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కవచ్చు అని ఎవరైనా ఊహించరా.. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. గుజరాత్ లోని వడోదరకు చెందిన ఇషాన్ రానా అనే టాటూ ఆర్టిస్ట్ డబ్బుతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డులలో స్థానం సంపాదించుకున్నాడు. 91 గంటలు 64 మందికి 74 రకాల టాటూలను వేసి గిన్నిస్ రికార్డు సాధించాడు. కాగా గతంలో ఇటాలియన్ మహిళ 65 గంటల పాటు టాటూ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు ఇషాన్ రానా.